యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ తరవాత తరంలో ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగారు. తాత రూపురేఖలతోనే కాకుండా నటనలోనూ తాతకు తగ్గ మనవడు అని నిరూపించుకున్నాడు. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఇండస్ట్రీలో తారక్ పై ఇప్పటి వరకూ ఎలాంటి రూమర్ లు కూడా రాలేదు.
Advertisement
అంతే కాకుండా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతున్నాడు. ఎన్టీఆర్ తమ బంధువుల కూతురు లక్ష్మి ప్రణతిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఎన్టీఆర్ ప్రణతి దంపతులకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
Advertisement
ఎన్టీఆర్ ది పేరెంట్స్ కుదిర్చిన సంబంధం అయినప్పటికీ బంధువుల అమ్మాయి కావడంతో ప్రణతితో ముందు నుండే పరిచయం ఉందట. దాంతో వీరిద్దరూ పెళ్లికి ముందు తరచూ ఫోన్ లో మాట్లాడుకునేవారట. ఆ సమయంలో ఎన్టీఆర్ కు ప్రణతి కొన్ని కండిషన్స్ కూడా పెట్టినట్టు టాక్. పెళ్లి చేసుకున్న తరవాత సినిమాలతో బిజీగా ఉన్నా సరే ప్రతి యేడాది తన కోసం రెండు నెలలు సమయం కేటాయించాలని ప్రణతి చెప్పిందట.
అంతే కాకుండా పెళ్లికి ముందు ఎన్టీఆర్ ఎక్కువగా ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లేవాడు. దాంతో పెళ్లి తరవాత ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లడం తగ్గించుకోవాలని చెప్పిందట. ఎన్టీఆర్ అవుడ్ డోర్ షూట్ లకు వెళ్లేటప్పుడు వేసుకునే డ్రెస్ తనే కేర్ తీసుకుంటానని ముందే చెప్పిందట. అలా ముందుగానే ప్రణతి ఎన్టీఆర్ కు కండిషన్స్ పెట్టగా అవి కూడా చిన్నవే…ప్రస్తుతం ఈ జంట చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ALSO READ : టాలీవుడ్ ను జక్కన్నే నాశనం చేశాడు…దర్శకదీరుడి పై ఆర్జీవీ ఫైర్..!