టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్లు చాలా అరుదుగా ఉంటారు. పాత సినిమాల్లో రమా ప్రభ, గిరిజ, ఆ తర్వాత కాలంలో శ్రీలక్ష్మి, వై.విజయ కామెడీ పాత్రలు చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు. ఆ తర్వాత కాలంలో వారి స్థానాన్ని భర్తి చేసినా వారిలో నటి కల్పన రాయ్ కూడా ఒకరు . కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు 400 పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కలిసుందాం రా, హిట్లర్, చాలా బాగుంది చిత్రాల్లో ఆమె చేసిన కామెడీని ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు. అయితే కల్పన రాయ్ పేరు వినగానే.. చాలా మంది ఆమె తెలుగు నటి కాదని అనుకుంటారు.
Advertisement
కల్పన రాయ్ పక్కా తెలుగింటి ఆడపడుచు.. ఆమె కాకినాడలో జన్మించారు. కల్పన రాయ్ అసలు పేరు సత్యవతి. అయితే సినిమాల్లోకి వచ్చాక కల్పనగా పేరు మార్చుకున్నారు. ఇక ఆమె పేరులోని రాయ్ వెనక ఓ పెద్ద కథే ఉంది. ఆమె కాకినాడలో ఉండే సమయంలో కల్పన, మోహన్ రాయ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఈ క్రమంలోనే అతడి పేరునే తన పేరుగా కల్పన రాయ్ అని మార్చుకోవటం జరిగిందట. ఇక హీరోయిన్ శారదకు కల్పన రాయ్ పెద్ద అభిమాని. శారదతో కల్పన రాయ్‌కు ఉన్న పరిచయం కారణంగా.. ఆమె సలహా మేరకు సినిమాల్లోకి వచ్చింరట కల్పన రాయ్. ఇక సినిమాల్లో దర్శకుడు కోడి రామకృష్ణ కల్పన రాయ్‌కు ఎక్కువ అవకాశాలు కల్పించారు. జంబలకడిపంబ, కలిసుందాం రా, హిట్లర్ అతి చిత్రాలతో కల్పన రాయి కమెడియన్ గా ప్రేక్షకుల్లో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Advertisement
ఇక కల్పనా వ్యక్తిగత జీవితంలోకి వెళితే.. ఆమెకు ఓ కుమార్తె ఉంది. అయితే ఆమె కూతురు ఇష్టం లేకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. ఈ సంఘటనతో కల్పన రాయ్ బాగా మానసికంగా చాలా కృంగిపోయారట. కల్పన రాయ్‌కు డబ్బు మీద కూడా అంతగా వ్యామోహం ఉండేది కాదట. ధనవంతులు ఇంట పుట్టిన ఆమె సినిమాల్లోకి రాక ముందు నుంచి కూడా విపరీతంగా దానధర్మాలు చేసేవారట. ఆ అలవాటును సినిమాల్లోకి వచ్చాక కూడా కొనసాగించడంతో, సినిమాల ద్వారా వచ్చిన డబ్బును పొదుపు చేయకుండా అడిగిన వారికల్ల దానం చేస్తూ.. ఆమె చివరి రోజుల్లో ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు.
మరోవైపు డయాబెటీస్ ఆమె ఆరోగ్యం క్షీణించి.. ఆ సమయంలో చూసుకునేవారు ఎవరు లేకపోవడంతో ఒంటరిగా మిగిలిపోయారు కల్పనా రాయ్. ఆమె కనీసం అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని దీన స్థితిలో మరణించారు. దాంతో ఇండస్ట్రీకి చెందిన కొందరు దాతలు ముందుకు వచ్చి.. తమ సొంత ఖర్చుతో కల్పన రాయ్‌కు అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. పుట్టుకతోనే ధనవంతురాలైన కల్పన రాయ్.. చివరి రోజుల్లో అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని దీన స్థితిని చూడాల్సి వచ్చిందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు
ఆ స్టార్ హీరోయిన్ కి రానా క్షమాపణలు.. కారణం అదేనా ?
ఖుషి మ్యూజికల్ కన్సర్ట్ లో విజయ్ వ్యాఖ్యలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!
Srileela : శ్రీలీల గురించి నాగ సౌర్య చెప్పిన ఈ మాటలు వింటే హ్యాట్సాఫ్ అంటారు..!