Home » Kushi Movie Review :”ఖుషి” సినిమా రివ్యూ & రేటింగ్ ! విజయ్ హిట్ కొట్టారా ? లేదా ??

Kushi Movie Review :”ఖుషి” సినిమా రివ్యూ & రేటింగ్ ! విజయ్ హిట్ కొట్టారా ? లేదా ??

by Bunty
Published: Last Updated on
Ad

VIjay Devarakonda Kushi Review: ఖుషి సినిమా ఈరోజు తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివనిర్వాన కథ రచన అందించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో అందమైన ప్రేమ కథగా దీన్ని తీసుకువచ్చారు. విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, లక్ష్మీ, ఆలీ, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఈ మూవీలో నటిస్తున్నారు.

Kushi Movie Review and Rating

Advertisement

కథ మరియు వివరణ :

ఖుషి సినిమా కథ విషయానికి వస్తే.. కథ కాశ్మీరులో మొదలవుతుంది. బురఖాలో ఉన్న బేగం (సమంత)ని చూసి ఇది నా పిల్ల అని ఫిక్స్ అయిపోతాడు. విప్లవ్ (విజయ్ దేవరకొండ) తొలిచూపులోనే బేగం ప్రేమలో పడతాడు విప్లవ్. అనూహ్య పరిస్థితుల్లో బ్రాహ్మిన్ అయిన ఆరాధ్య సమంత బేగంగా మారాల్సి వస్తుంది. చంద్రరంగం (మురళీ శర్మ) గారి అమ్మాయి ఆరాధ్య ప్రేమను పొందడానికి లెనిన్ సత్యం (సచిన్ కేడేకర్) గారి కొడుకు విప్లవ్ పెద్ద పోరాటమే చేస్తాడు. ఆరాధ్య ప్రేమను సాధిస్తాడు. ఆరాధ్యది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. విప్లవ్ ది నాస్తిక కుటుంబం కావడంతో సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడరు. ఈ ప్రేమ పోరాటంలో పెద్దలనుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో… పెద్దలను ఎదిరించి మరి ఆరాధ్య-విప్లవ్ లు పెళ్లి చేసుకుంటారు.

Advertisement

ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ. ఆరాధ్య, విప్లవ్ లు పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తారు… వాళ్ళు విడిపోతారా అనేదానికోసం సినిమా చూడాల్సిందే. ఎప్పుడూ ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీసే దర్శకుడు శివనిర్వాన ఈసారి అది ఎక్కడో మర్చిపోయినట్టు ఉంది. సినిమా కాశ్మీర్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత అసలు పాయింట్ మొదలవుతుంది. జనరల్ గా అందరూ అనుకున్నట్లయితే పెళ్లి తర్వాత ఇది చేద్దాం. అది చేద్దాం అని ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న జంటలకు ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. 2 గంటల 40 నిమిషాలు ఉన్న ఈ సినిమా అక్కడక్కడ బోర్ కొట్టిన పర్లేదు అప్పుడప్పుడు ఎంటర్టైన్ చేస్తుంది. సినిమాలో ఎడిటర్ ఇంకా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఈ వీకెండ్ టైం పాస్ అవ్వకుంటే ఫ్యామిలీతో వెళ్లొచ్చు.

ప్లస్ పాయింట్స్
విజయ్ దేవరకొండ, సమంత
మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
లోకేషన్లు

మైనస్ పాయింట్స్
ఎడిటింగ్
కథనం

రేటింగ్ 2.75/5

ఇవి కూడా చదవండి 

ఛాన్స్‌ వస్తే పెళ్లి చేసుకుని….ఆ పని కూడా చేస్తా – నగ్మా సంచలనం

గురూజీ కారణంగా ప్లాప్ అయిన మెగాస్టార్ సినిమా ఏదో తెలుసా ?

 

Visitors Are Also Reading