నటి కుష్భూ అంటే తెలియని వారు ఉండరు. ఒకప్పుడు కుష్భూ స్టార్ హీరోయిన్ గా రానించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ హిందీ భాషల్లో కుష్భూ సినిమాలు చేసి అలరించింది. హీరోయిన్ గా బాలయ్య లాంటి స్టార్ హీరోలకు కుష్భూ జోడీ కట్టింది. అంతే కాకుండా నటిగా పలు సూపర్ హిట్ చిత్రాలతో తన అద్భుతమైన నటనతో అలరించింది. కేవలం సినిమాలలోనే కాకుండా రాజకీయాల్లోనూ కుష్భూ తనదైన స్టైల్ లో రానించింది.
Advertisement
మొదట కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఆ తరవాత బీజేపీ లో చేరింది. రాజకీయాల్లో కుష్భూ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం కూడా కుష్భు రాజకీయాలు మరియు సినిమాలతో పాటూ టీవీ షోల లోనూ కనిపిస్తోంది.
Advertisement
ఇక కుష్భూ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే సుందర్ ను ఆమె వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కాగా తన ఫ్యామిలీ ఫోటోలను కుష్భూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా తన కూతుళ్ల ఫోటోను షేర్ చేయగా ఓ నెటిజన్ కోపం వచ్చేలా కామెంట్ లు చేశాడు. కుష్భూ కూతుళ్ల ఫోటోకు నెటిజన్ వారు వారి ముక్కులకు సర్జరీ చేసుకున్నారు అంటూ కామెంట్ పెట్టాడు.
కాగా ఆ కామెంట్ పై కుష్భూ ఫైర్ అయ్యింది. 20, 22 ఏళ్ల వయసున్న పిల్లలు కత్తులతో సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏముంది..చిన్నపిల్లలపై కామెంట్ చేయం సిగ్గు చేటు. కనీసం పిల్లలను అయినా వదిలేయండి అంటూ పేర్కొంది. ఇక కుష్భూ ఇచ్చిన కౌంటర్ తో సదరు నెటిజన్ నోరు మూసుకున్నాడు. అంతే కాకుండా నెటిజన్ లు కుష్భూ కు సపోర్ట్ చేస్తూ ఆకతాయికి గట్టిగా బుద్దిచెప్పారంటూ సపోర్ట్ గా నిలిచారు.