తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో భాగంగా ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారు. ఏపీ సిఐడి పోలీసులు పక్కా ఆధారాలు కోర్టుకు చూపించడంతో… చంద్రబాబును జైలుకు తరలించారు. అయితే నారా చంద్రబాబు నాయుడు అరెస్టయి దాదాపు 37 రోజులు అయిపోయింది.
దీంతో చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం ఏపీవ్యాప్తంగా నిరసనలు తెలుపుతోంది. ఇటు హైదరాబాదులోనూ అడపాదడపా నిరసనలు జరుగుతున్నాయి. అయితే రోడ్లపై నిరసనలు తెలిపితే చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో… చంద్రబాబు అరెస్ట్ పై తాజాగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక బిజెపి ఉందని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని మంత్రి కేటీఆర్ టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు.
Advertisement
Advertisement
చంద్రబాబు అరెస్టు వెనుక మోడీ ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని.. ఇద్దరూ కలిసి ఆయనను ఇరికించినట్లు అందరూ చర్చించుకుంటున్నట్లు తెలిపారు కెటిఆర్. 70 సంవత్సరాలు దాటిన చంద్రబాబును అరెస్ట్ చేయడం చాలా దారుణమన్నారు. లోకేష్, జగన్, పవన్ నాకు మంచి మిత్రులు అని వెల్లడించారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా హైదరాబాద్ లో నిరసన తెలిపితే, ధర్నా చౌక్ లో నిరసన తెలపండి పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.
ఇవి కూడా చదవండి
- హీరో తొడలపై కూర్చోమన్నారు…ఎంగిలి ఐస్ క్రీమ్ తినమన్నారు – సుహాసిని
- Sree Leela : శ్రీ లీల – అనిల్ రావిపూడి మధ్య ఆ రిలేషన్..?
- ఈ ఒక్క సీన్ కోసం…రూ.20 లక్షలు వసూలు చేసిన రష్మిక…!