Home » కృతి శెట్టి కెరీర్ లాగానే హీరోయిన్ శ్రీ లీల కెరీర్ నాశనం అయిందిగా ?

కృతి శెట్టి కెరీర్ లాగానే హీరోయిన్ శ్రీ లీల కెరీర్ నాశనం అయిందిగా ?

by Bunty
Ad

శ్రీలీల ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. తన అద్భుతమైన అందం, డాన్స్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయకుండా తన అద్భుతమైన నటనతో సినిమాలు చేసుకుంటూ పోతోంది. ముఖ్యంగా ఎక్స్పోజింగ్ పాత్రలు, రొమాం**టిక్ సీన్లు, లిప్**లాక్ సీన్లు వంటి వాటికీ శ్రీలీల చాలా దూరంగా ఉంటారు.

Advertisement

కథల ఎంపిక విషయంలో శ్రీలీల తీసుకున్నన్ని జాగ్రత్తలు ఏ హీరోయిన్ కూడా తీసుకోదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరి సరసన నటిస్తోంది. రవితేజ, మహేష్ బాబు, నితిన్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు శ్రీలీలకు ఫ్యాన్స్ అవుతున్నారు. ప్రస్తుతం శ్రీలీల హవా కొనసాగుతున్న సమయంలో….. ఈ అమ్మడుకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. తాను కథల ఎంపిక విషయంలో కాస్త మిస్టేక్ చేస్తున్నట్లు, అనుభవం లేకపోవడం వల్లేనేమో శ్రీలీల సినిమాలు కాస్త ఫ్లాప్ అవుతున్నాయని ప్రేక్షకులు అంటున్నారు.

Advertisement

కొన్ని నెలల నుంచి వరుసగా నెలకొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న శ్రీలీల వరుసగా రెండు ఫ్లాపులను తన ఖాతాలో వేసుకుంది. లేటెస్ట్ గా వైష్ణవ తేజ్ తో కలిసి “ఆదికేశవ” సినిమాలో నటించింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. “స్కంద” సినిమా కూడా ఫ్లాప్ కావడంతో శ్రీలీల ఖాతాలో రెండు ఫ్లాపులు పడ్డాయి. ఇలా అయితే శ్రీలీల కెరియర్ ముగుస్తుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ అమ్మడు డిసెంబర్ లో నితిన్ సరసన హీరోయిన్గా నటించిన “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్”, జనవరిలో మహేష్ బాబు తో నటించిన “గుంటూరు కారం” సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ రెండు సినిమాలతో శ్రీలీల ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading