టాలీవుడ్ లో వరుస విషాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఒకప్పటి స్టార్ కృష్ణంరాజు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువకముందే మహేష్ బాబు ఇంట్లో కూడా విషాదం నెలకొంది. మహేష్ బాబు తల్లి కృష్ణ భార్య ఇందిరాదేవి అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో మహేష్ బాబు తీవ్ర దిగ్బ్రాంతి చెందాడు. ఇదిలా ఉంటే, కృష్ణ మొదట ఇందిరా దేవిని వివాహం చేసుకోగా, ఆ తర్వాత తన కోస్టార్ అయిన విజయనిర్మలను వివాహం చేసుకున్నారు.
read also : నీచ్ కమీన్ కుత్తే… KGF పై తెలుగు డైరెక్టర్ దారుణ వ్యాఖ్యలు
Advertisement
కృష్ణకు కుటుంబ సభ్యులు సినిమాల్లోకి రాకముందు ఇందిరా దేవితో వివాహం జరిపించారు. వీరికి రమేష్ బాబు, మహేష్ బాబు తో పాటు మంజుల సంతానం ఉన్నారు. ఇక కృష్ణ విజయనిర్మలతో పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. అయితే కృష్ణ తన రెండో భార్య విజయనిర్మల చనిపోయిన తర్వాత తనతో ఎలాంటి బంధం లేని నరేష్ కుటుంబంతో ఉన్నారు. అలా ఉండటం అందరిని ఆశ్చర్యపరిచింది. దీనికి ఓసారి సమాధానమిచ్చిన కృష్ణ తనకు ఎలాంటి అవసరం వచ్చిన క్షణాల్లో అది చేసి పెట్టేది కేవలం నరేష్ మాత్రమే అని చెప్పుకొచ్చారు.
Advertisement
read also : 12 ఏళ్లు ప్రేమించుకున్నాం… 6 ఏళ్లు కష్టాలు అనుభవించాం- మంచి మనోజ్
అంతేకాదు, అతను షూటింగ్ లో ఉన్నా కూడా తనకోసం ఎప్పుడూ ఆలోచిస్తాడని, ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వస్తాడని చెప్పుకొచ్చాడు. మహేష్ స్టార్ హీరోగా బిజీ అయిన నేపథ్యంలో, అతనికి సంబంధించిన కొన్ని బాధ్యతలను నమ్రత చూసుకుంటుంది. ఆ సమయంలో మహేష్ పై భారం పెట్టడం ఇష్టం లేక వారికి భారంగా ఉండకూడదు అని నరేష్ ఇంట్లో ఉన్నాడని టాక్. విజయనిర్మల మరణించిన తర్వాత కూడా నరేష్ అతని బాగోగులను దగ్గర ఉండి చూసుకున్నాడు. ఆమె లేని లోటు కూడా తెలియకూడదు అని ఆరాటపడ్డాడు. ఒంటరితనం అతడిని బాధ పెడుతున్నప్పటికీ నరేష్ మాత్రం చేయాల్సింది అంతా చేసేసాడు.
read also : “వీర సింహారెడ్డి” ఎవరో నాకు తెలీదు.. విలన్ డైలాగ్ పై ట్రోలింగ్