సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఆయనకు సంబంధించిన అనేక విషయాలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. కృష్ణ గారి కుటుంబ విషయాలు…ఆయన సినిమాలకు సంబంధించిన అంశాలు ఇలా చాలా విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి విషయాలలో కృష్ణ రామోజీరావు మధ్య జరిగిన ఇష్యూ కూడా ఒకటి. 1994 సంవత్సరంలో కృష్ణ రామోజీరావు మధ్య ఓ ఇష్యూ జరిగింది. అసలు ఇద్దరి మధ్య ఇష్యూ ఎందుకు మొదలైంది.
Advertisement
ఎలా మొదలైంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం….కృష్ణకు సాధారణంగా కోపం రాదు. ఒకవేళ వచ్చిందంటే అది పోదు. 1994లో నాదెండ్ల ఎపిసోడ్ తరవాత ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో సూపర్ స్టార్ కాంగ్రెస్ తరుపున ప్రచారం చేశారు. ఎన్టీఆర్ పై ఆయన సెటైర్ లు వేయడం చురకలు అంటించడం లాంటివి చేసేవారు.
Advertisement
దానికి ముందే ఎన్టీఆర్ కృష్ణ మధ్య విభేదాలు నెలకొన్నాయి. కాగా రామోజీరావు ఆ సమయంలో బహిరంగంగా తెలుగుదేశంకు సపోర్ట్ చేసేవారు. అంతే కాదు ఎన్టీఆర్ ప్రసంగాలను సైతం ఈనాడు పాత్రికేయులు రాసేవారని టాక్ ఉంది. కాగా 1994లో డిసెంబర్ 20 వ తేదీన బహిరంగ సభలో కృష్ణ భావోద్వేగంతో మాట్లాడారు. ఆ స్పీచ్ లో ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సభలో కృష్ణపై కొంతమంది దాడి కూడా చేశారు.
ఆ మరుసటి రోజు కృష్ణ హైదరబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈనాడు అధినేత మరియు ఎన్టీఆర్ పై విమర్శలు కురిపించారు. తన పై దాడికి ఈనాడు మరియు ఎన్టీర్ బాధ్యత వహించాలని అన్నారు. తన సభకు లక్షల మంది వస్తే ఈనాడు మూడు వందల మంది వచ్చారని రాసిందని ఒక పార్టీకి సపోర్ట్ చేసే హక్కు ఈనాడుకు ఎవరిచ్చారని కృష్ణ ప్రశ్నించారు. కృష్ణ స్పీచ్ పై ఈనాడు మరుసటి రోజు కృష్ణకు సెటైర్ లు వేస్తూ మరో ఆర్టికల్ రాసింది. ఎడిటర్ పేరిట ఆ ఆర్టికల్ ను రాసుకువచ్చింది. అలా కృష్ణ రామోజీరావు మధ్య విభేదాలు ఏర్పడగా అవి ఎన్టీఆర్ చనిపోయిన తరవాత చల్లబడ్డాయి.