Home » నాగార్జున పిటిషన్ పై కౌంటర్ ఇచ్చిన కొండా సురేఖ .. నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ..!

నాగార్జున పిటిషన్ పై కౌంటర్ ఇచ్చిన కొండా సురేఖ .. నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ..!

by Sravanthi
Ad

మంత్రి కొండ సురేఖ పై సినీ నటుడు నాగార్జున పరువు నష్టం దావా వేసిన సంగతి మనకు తెలుసు. ఇప్పటికే నాంపల్లి కోర్టులో ఈ కేసు పై విచారణ జరిగింది. నాగార్జున తో పాటుగా అమల, నాగ చైతన్య కూడా కోర్టుకు వచ్చారు. నాగార్జునతో పాటుగా సాక్ష్యులు స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. నాగార్జున పిటిషన్ కి కౌంటర్ దాఖలు చేశారు కొండ సురేఖ తరపు న్యాయవతి. కొండ సురేఖ కౌంటర్ పై నాంపల్లి స్పెషల్ కోర్టు విచారణ చేయనుంది.

Advertisement

కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆయన కుటుంబ గౌరవాన్ని అలాగే ప్రతిష్టతను దెబ్బతీసేలా ఉన్నట్లు నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి అన్నారు. కొండ సురేఖ మాటలు అభ్యంతరంగా ఉన్నాయని.. నాగార్జున కుటుంబాన్ని కించపరిచేలా ఉన్నాయని అన్నారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున అడ్వకేట్ చెప్పారు.

Advertisement

Also read:

కొండ సురేఖ తరపు నయవాది గురుమిత్ సింగ్ వాదనలు వినబోతున్నారు. ఎటువంటి నిర్ణయం కోర్టు తీసుకుంటుంది అనేది చూడాలి కొద్ది రోజుల క్రితం కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చకుండా ఉండాలంటే నాగర్జున మాజీ మంత్రి కేటీఆర్ కి కండిషన్ పెట్టారని.. అందుకనే చైతన్య, సమంత మధ్య విడాకులు జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading