యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి25న థియేటర్ లలో విడుదలైంది. కాగా ఈ సినిమా మొదటిరోజే వందకోట్లకు పైగా కలెక్షన్ లను రాబట్టింది. అంతే కాకుండా కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం 500కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంగా ఉన్న సంగతి తెలిసిందే.
చరణ్ కంటే ఎన్టీఆర్ రోల్ కు ప్రాధాన్యత తక్కువ ఇచ్చారని అభిమానులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా సినిమాలో ఎన్టీఆర్ నటనను సరిగ్గా వాడుకోలేదని ఆరోపిస్తున్నారు. కానీ తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ నటనకు ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా కొమురంభీముడో పాటకు ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్ కు ప్రశంసలు అందుతున్నాయి.
Advertisement
Advertisement
ఈ పాటలో ఎన్టీఆర్ చేసిన ఎమోషన్స్ చూసి థియేటర్లలో కన్నీళ్లు పెడుతున్నారు. ఇక ఈ పాట కూడా ఎంతో పాపులర్ అయ్యింది. విడుదలకు ముందే ఈ పాటకు ప్రశంసలు అందాయి. ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రాయగా కీరవాని స్వరాలు సమకూర్చారు. ఇదిలా ఉండగా ఈ పాటపై కొన్ని ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఈ పాటను ఓ తెలంగాణ ఫోక్ సాంగ్ నుండి కాపీ కొట్టారు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.
ALSO READ : RRRలో “లోకి” పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసా…? జకన్న ఎలా ఆఫర్ ఇచ్చారంటే….!
రంగులకల సినిమాలో గద్దర్ పాడిన మదనా సుందారి పాట నుండి కొమురం భీముడో ట్యూన్ ను కాపీకొట్టినట్టు ట్రోల్స్ వస్తున్నాయి. మదనా సుందారి పాటను ప్రముక రచయిత గూడ అంజయ్య రాసారు. ఈ పాటను గద్దర్ పాడారు. అయితే కాపీ ట్యూన్ అయితే ఏంటి..? కొమురం భీముడో పాట వల్ల దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని కామెట్లు పెడుతున్నారు.