ఒరిస్సాలో జరిగినటువంటి ఘోరమైన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఎంతోమంది మరణించారు. అనేకమంది చికిత్స తీసుకుంటున్నారు. భారతీయ రైల్వే చరిత్రలో అతిపెద్ద విషాదంగా పిలవబడుతున్న ఈ ప్రమాదం ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన వారికి 10 లక్షల నష్టపరిహారం ప్రకటించిన రైల్వేశాఖ తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 50,000 నష్టపరిహారం ప్రకటించింది.
Advertisement
అయితే రైల్వే ప్రమాద బాధితులకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 60 కోట్లు సహాయం చేస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఎంఎస్ ధోని స్పందించలేదు. అయితే ఇవన్నీ రూమర్స్ అని ధోని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని తేలింది.
Advertisement
మరో టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాత్రం తన వంతుగా బాదిత కుటుంబాలకు లక్ష రూపాయలు విరాళంగా అందించారు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం తన గొప్ప మనసును చాటుకున్నారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబంలోని పిల్లలకు సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఉచిత విద్యతోపాటు అనేక సదుపాయాలు కల్పిస్తానని ప్రకటించారు. ఇంతకుముందు కూడా సెహ్వాగ్ పుల్వామా ఉగ్రవాద దాడిలో మరణించిన అమర జవాన్ల కుటుంబంలోని పిల్లలకు కూడా ఉచిత విద్య అందిస్తానని ప్రకటించిన సేహ్వగ్ దాన్ని నిలబెట్టుకున్నారు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
Balayya : గ్లోబల్ లయన్ గా వచ్చేసిన బాలయ్య
క్రికెటర్లు లంచ్ బ్రేక్ లో ఏం తింటారో తెలుసా?
నీ బట్టతల మీద వెంట్రుకల కంటే నా దగ్గరున్న డబ్బే ఎక్కువ… సెహ్వాగ్‌తో షోయబ్ అక్తర్ కామెంట్!