కృష్ణ చేయాల్సిన సినిమా చిరంజీవి, చిరంజీవి చేయాల్సిన సినిమా కృష్ణ చేశారు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. నిజంగా ఈ సినిమాల్లో వారిని తప్ప వేరే వారిని ఊహించడం కూడా కష్టమే! ఇంతకీ ఆ సినిమాలేవి? ఒకరి సినిమా ఇంకొకరికి ఎలా వెళ్లిందో ఇప్పుడు చూద్దాం!
Advertisement
ఖైదీ :
1983లో డైరెక్టర్ కోదండ రామిరెడ్డి హీరో కృష్ణకు ఖైదీ సినిమా కథను వినిపించారు. అప్పటికే కృష్ణ ఫుల్ బిజీగా ఉన్నారు. కృష్ణ కోసం కొన్ని నెలలు వెయిట్ చేసిన కోదండ రామిరెడ్డి తర్వాత అదే కథను చిరంజీవికి వినిపించాడు. అప్పుడప్పుడే ఎదుగుతున్న చిరంజీవి ఈ సినిమాకు ఓకే చెప్పడంతో …అది కాస్త చిరు కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచింది.
Also Read: జైలు జీవితం గడిపిన సుమన్‌కు పిలిచి పిల్లనిచ్చిన దిగ్గజం ఎవరో తెలుసా..?
Advertisement
నెంబర్ వన్:
1993 లో SV కృష్ణారెడ్డి అన్నయ్య అనే సినిమా కథను చిరంజీవికి వినిపించాడు. చిరుకు స్టొరీ నచ్చింది కానీ తనను SV కృష్ణారెడ్డి ఎలా హ్యాండిల్ చేస్తాడనే ఆనుమానంతో ఆ సినిమాను వదులుకున్నాడు. కథ కృష్ణకు చేరింది. అప్పటికే వరుస ప్లాప్ లతో ఉన్న కృష్ణ ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు. అన్నయ్య అనే టైటిల్ తో ఆల్రెడీ కృష్ణ సినిమా చేసి ఉండడంతో ఆ టైటిల్ ను నెంబర్ వన్ గా మార్చారు. ఇది కూడా సూపర్ హిట్ గా నిలిచింది. కృష్ణ వదిలేసిన ఆ సినిమా చిరుకు లైఫ్ ఇస్తే, చిరు వదిలేసిన ఆ సినిమా కృష్ణ కు మళ్ళీ బ్రేక్ ఇచ్చింది.
Also Read: ఫిబ్రవరి నెలలో 28, 29 రోజులు మాత్రమే ఎందుకు ఉంటాయో తెలుసా..?