బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి పై ఏపీ మాజీ మంత్రి, వైసిపి పార్టీ గుడివాడ ఎమ్యెల్యే కొడాలి నాని ఫైర్ అయ్యారు. తాజాగా మీడియాతో కొడాలి నాని మాట్లాడుతూ…టీడీపీకి బీ టీమ్ దగ్గుబాటి పురంధరేశ్వరి అంటూ ఆగ్రహించారు. అన్న గారు ఎన్టీఆర్ కు ద్రోహం చేసిన వారిలో బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి పాత్ర ఉందని నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ పదవిని చంద్రబాబుకు ఇప్పించింది బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి కుటుంబమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుతో కలిసి ఆయన సీఎం అవటంలో కీలక పాత్ర పోషించిందని బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరిపై నిప్పులు చెరిగారు. దగ్గుబాటి పురంధరేశ్వరి లాంటి కూతురు ఎవరికి ఉండదని మండిపడ్డారు కొడాలి నాని. చంద్రబాబు చేసిన ప్రతి అవినీతిలో ఆవిడ వాటా ఆమెకు వెళ్తోందని ఆరోపణలు చేశారు.
Advertisement
Advertisement
చంద్రబాబు ఇసుక దోపిడీ లో కూడా ఆవిడకు వాటాలు వెళ్ళాయన్నారు కొడాలి నాని. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ అంటూ సిగ్గులేని ఆరోపణలు చేస్తోంది…4 వేలు కోట్లు ఆదాయం జగన్ హయాంలో ఇసుక ద్వారా వచ్చిందన్నారు కొడాలి నాని. చంద్రబాబు హయాంలో ఇసుక ద్వారా రూపాయి ఆదాయం లేదని విమర్శలు చేశారు. 2014, 2019 ప్రజలు బుద్ధి చెప్పినా ఆవిడ మారలేదు… చంద్రబాబు…. కోర్టులో దొంగ అఫిడవిట్ లు ఇస్తున్నారన్నారు కొడాలి నాని.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!