Telugu News » Blog » చంద్ర‌బాబు కోసం సొంత అన్న‌నే అవ‌మానిస్తారా..? : కొడాలి నాని

చంద్ర‌బాబు కోసం సొంత అన్న‌నే అవ‌మానిస్తారా..? : కొడాలి నాని

by Anji
Ads

భీమ్లానాయ‌క్ సినిమా పై మంత్రి కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. సినిమా టికెట్ల వ్య‌వ‌హారంపై విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై నాని ఘాటుగా స్పందించారు. నాగార్జున అయినా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ అయినా ప్ర‌భుత్వం దృష్టిలో అంద‌రూ ఒక‌టే అన్నారు. సీఎం జ‌గ‌న్ కు కుట్ర‌లు, కుతంత్రాలు తెలియ‌ద‌ని చెప్పారు. భీమ్లానాయ‌క్ సినిమాకు రాష్ట్రంలో కొత్త‌గా ఎలాంటి ష‌ర‌తులు పెట్ట‌లేద‌ని గుర్తు చేసారు. టికెట్ల రేట్ల‌పై క‌మిటీ సూచ‌న‌లు చేసిందని.. కానీ పెంచేలోపు అవాంత‌రాలు వ‌చ్చాయ‌ని నాని వెల్ల‌డించారు.

Ads

Also Read :  ”భీమ్లా నాయ‌క్” లో క‌నిపించిన ఈ న‌టుడు ఎవ‌రో తెలుసా..ఆఫ‌ర్ ఎలా వ‌చ్చిందంటే..!

Ads

ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌లు స‌రికాద‌న్నారు కొడాలి నాని. చంద్ర‌బాబు మాట‌లు న‌మ్మి మోస‌పోవ‌ద్దు అని..మీ అన్న మెగాస్టార్ చిరంజీవిని న‌మ్ముకో అని సూచించారు. సినిమాల‌ను, రాజ‌కీయాల‌కు ముడి పెట్ట‌వ‌ద్ద‌ని, టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు చేస్తున్న ఆరోప‌ణ‌లు అర్థ‌ర‌హిత‌మ‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు కొడాలి నాని ఆదివారం మీడియాతో ముచ్చ‌టించారు. చిరంజీవిని జ‌గ‌న్ ఎంతో గౌర‌విస్తారు అని దానిని త‌ప్పు ప‌ట్ట‌డం స‌రికాదు అన్నారు. పిల్ల‌ల్లో పిల్ల‌వాడిలా.. పెద్ద‌ల్లో పెద్ద‌వాడిగా చిరంజీవి ఉంటార‌ని, ఆయ‌న‌ను చిల్ల‌ర రాజ‌కీయాల్లో లాగ‌డం స‌రికాదు అన్నారు. చంద్ర‌బాబు కోసం సొంత త‌మ్ముడే అన్న‌ను అవ‌మానిస్తారా..? అని ప్ర‌శ్నించారు కొడాలి నాని.

ప‌వ‌న్ క‌ల్యాణ్ కుటుంబం ఉన్న‌త స్థానంలో ఉన్న‌దంటే దానికి కార‌ణం చిరంజీవి కాదా..? సీఎం అంటే రాష్ట్రానికి సినిమా రంగానికి పెద్ద‌గా ఉన్నార‌ని తెలిపారు. సీఎం జ‌గ‌న్ గురించి మాట్లాడేట‌ప్పుడు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడాల‌ని ప‌వ‌న్ కు చుర‌క‌లు అంటించారు. ప‌వ‌న్ తో పాటు సీపీఐ నేత నారాయ‌ణ‌పై కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కొడాలి నాని. నారాయ‌ణ ఓ వింత వ్య‌క్తి అని ఎద్దేవా చేశారు. ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై ఎవ‌రి ప‌క్ష‌మో తేల్చుకోలేని పార్టీ నేత త‌మ‌కు చెప్ప‌డం ఏమిటంటూ మండిప‌డ్డారు.

Ad

Also Read :  PAK vs AUS : 24 ఏళ్ల త‌రువాత పాక్‌లో అడుగు పెట్టిన ఆస్ట్రేలియా..!