సినీ ప్రపంచం అంటేనే ఎప్పటికప్పుడు పాత నీరు పోతూ కొత్త నీరు వస్తూ ఉంటుంది.. ఉన్న సమయంలోనే కళామతల్లి ఆశీస్సులతో టాలెంట్ కి పదును పెట్టి, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగి పోతూ ఉండాలి. ఇందులో హీరోల విషయం పక్కన పెడితే, హీరోయిన్లు మాత్రం ఎంత స్టార్ హీరోయిన్ అయిన ఐదు నుంచి పది సంవత్సరాల కంటే ఇండస్ట్రీలో కొనసాగడం చాలా కష్టం.. అలా ఇండస్ట్రీకి కొత్త కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు.పాత పాత హీరోయిన్లు వెనక్కి తగ్గుతూ ఉంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ విషయం చాలా క్రేజీగా మారుతుంది. ఇప్పుడు ఉన్న హీరోయిన్లలో చాలామంది ఒక్క సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్నారు.
Advertisement
అయితే సీతారామం సినిమాతో తెలుగులో డెబ్యూ చేసిన మృణాల్ ఠాకూర్ ఆ కోవకి చెందుతుందని చెప్పవచ్చు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ మూవీలో మృణాల్ సీత పాత్రలో నటించి అదరగొట్టింది. దుల్కర్ సల్మాన్ ఇందులో రామ్ పాత్రలో నటించగా ఈ మూవీ బాక్సాపీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాత్రని ఆమె నటన ను ఎంతగానో పొగుడుతున్నారు. మరి మృణాల్ ఠాకూర్ ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో? ఓ సారి చూద్దాం.. మహారాష్ట్రలో పుట్టిన ఠాకూర్ ముంబైలో తన స్కూల్, కాలేజ్ అంతా కంప్లీట్ చేసింది. 2012లో ముజే కుచ్ కెహతి ఏ కమూసియా అనే టీవీ సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది.
Advertisement
తర్వాత 2014లో కుంకుమ భాగ్య సీరియల్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించింది. హృతిక్ రోషన్, జాన్ అబ్రహం సరసన కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ విధంగా సినిమాలు చేస్తోంది కానీ హీరోయిన్ గా అనుకున్నంత గుర్తింపు మాత్రం లభించలేదు. ఎట్టకేలకు తెలుగులో సీతారామం సినిమాలో సీత పాత్రతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. తెలుగుతో పాటు తమిళ,మలయాళ భాషల్లో విడుదలైన ఈ మూవీ అన్ని ఇండస్ట్రీలలో మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీతో ఒక్కసారిగా స్టార్ అయిపోయి సీతగా అందరిని మనసులో చోటు సంపాదించుకుంది.
also read:
- ఆ మూవీ సక్సెస్ మీట్ లో జయప్రదను దారుణంగా అవమానించిన బాలచందర్.. కారణం..?
- CHANDRAMUKHI REAL STORY: చంద్రముఖి రాజుని చంపిందెవరు.. అసలు కథేంటంటే..?