పూర్వకాలంలో అణాలు, పైసలు మన తాతలు, వారి తండ్రులు చూసి ఉంటారు. ప్రస్తుతం అవేవి మారడం లేదు. చెప్పుకోవడానికి చరిత్రకు తప్ప ఏమి లేవు. కానీ ఇప్పుడు వాడుకలో ఉన్నది మాత్రం రూపాయి. రూపాయి నుంచి 2వేల నోట్ల వరకు ప్రతి ఒక్కరూ కరెన్సీని చూసే ఉంటారు. ఇంతకు 1000 రూపాయల నోటు ఉండేది. నోట్ల రద్దు చేసి రూ.1000 తీసేసి కేంద్ర ప్రభుత్వం రూ.2వేల నోటు ప్రవేశపెట్టింది. ఇది ఇలా మాత్రం మీరు ఎప్పుడైనా సున్నా రూపాయి నోటు చూశారా..? అలాంటి నోటు ఒకటి ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ఒకప్పుడు సున్నా రూపాయ నోట్లను కూడా ముద్రించేవారట. ఆ నోట్లను ఎందుకు ముద్రించారు..? అని మీకు డౌన్ రావచ్చు. ఇప్పుడు దాని వెనుక ఉన్న అసలు కారణమేమిటో తెలుసుకుందాం.
Also Read : రాజీవ్‌గాంధీకి మురారి సినిమాకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసా..?
Advertisement
అది 2007 సంవత్సరం. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా దేశంలో సున్నా రూపాయ నోట్లను ముద్రించలేదు. కానీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ సున్నా రూపాయ నోటును ముద్రించింది. తమిళనాడుకు చెంది ఫిప్త్ ఫిల్లర్ అనే ఈఎన్‌జీఓ లక్షల జీరో రూపాయల నోట్లను ముద్రించింది. ఈ నోట్లను హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం నాలుగు భాషల్లో ముద్రించారు. ఈనోట్లను ముద్రించడం వెనుక ఉద్దేశం అవినీతి, నల్లధనంపై ప్రజలకు అవగాహన కల్పించడమే. అవినీతి నల్లధనంపై పోరాటంలో సున్నా రూపాయి నోటును ఆయుధంగా మార్చారు. వివిధ భాషల్లో ముద్రించిన ఈ నోట్లపై ఎవరైనా లంచం అడిగితే ఈ నోటు ఇచ్చి.. ఈ విషయంపై చెప్పండి అని ప్రచారం చేశారు.
Advertisement
సున్నా రూపాయి నోట్లను ముద్రించడం ద్వారా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సంస్థ ప్రయత్నించింది. వీటిలో 25 లక్షలకు పైగా నోట్లు ఒక్క తమిళనాడు పంపిణీ అయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల నోట్లను పంపిణీ చేశారు. ఈ ప్రచారాన్ని ఫిప్త్ ఫిల్లర్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు విజయ్ ఆనంద్ ప్రారంభించారు. తమ వాలంటీర్ల ద్వారా రైల్వే స్టేషన్లు మొదలుకొని ప్రతీ కూడలి, మార్కెట్లలో సున్నా రూపాయి నోట్లను ముద్రించిన కరపత్రాన్ని కూడా అందరికీ అందించారు. ఫిప్త్ ఫిల్లర్ సంస్థ గత ఐదేళ్లుగా దక్షిణ భారతదేశంలో 1200 పాఠశాలలు, కళాశాలతో పాటు ప్రజలను కలిసి అవినీతికి వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తోంది. ఇప్పటివరకు ఈ సంస్థకు మద్దతుగా 5లక్షల మందికి పైగా సంతకాలు చేశారు. నేను లంచం తీసుకోను, ఇవ్వను అని ఈనోట్పై రాసి ఉంటుంది.