భారత్ ఆసియాకప్ ను సొంతం చేసుకుంది. స్వదేశంలో కానీ మరొక కీలక పోరుకు సిద్ధమైంది. వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్లో టీం ఇండియా తలపడనుంది సెప్టెంబర్ 22న మొహాలీ వేదికగా జరగనున్న తొలి వన్డేల్లో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే తమ జట్టును కూడా ప్రకటించే ప్రకటించేసింది. ఇక భారత్ జట్టును అజిత్ అగర్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. ఇక ఈ సిరీస్ లో రెండు మ్యాచ్ లకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాలతో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కులదీప్ యాదవ్ లకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు సెలెక్టర్స్.
ఆసిస్ సిరీస్ లో భారత జట్టు పగ్గాలు స్టార్ బ్యాటర్ అయిన కేఎల్ రాహుల్ కు అప్పజెప్పాలని సెలెక్టర్లు నిర్ణయించుకున్నారు. ఇక యువ ఆటగాళ్లు సుందర్, తిలక్ వర్మ, ఋతురాజ్ గైక్వాడ్ లకు వన్డే సిరీస్ లకు అవకాశం ఇచ్చారు. ఇదేవిధంగా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ అందుబాటుపై కూడా సందేహం నెలకొంది. అక్షర్ పటేల్ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏలో ఉన్నాడు. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది.
Advertisement
Advertisement
తొలి రెండు వన్డేలకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, జె బుమ్రా, ఎం సిరాజ్, ఎం షమీ, తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్
3వ వన్డే జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, జే బుమ్రా, ఎం సిరాజ్, ఎం షమీ, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ( ఫిట్‌నెస్‌కు లోబడి), ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్
ఇవి కూడా చదవండి
- షకీలాకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఆ డబ్బులు ఏం చేసిందో తెలుసా?
- Akkineni Nagarjuna : చిక్కుల్లో అక్కినేని నాగార్జున కుటుంబం.. సుశాంత్ సినిమాలే కారణమా..?
- నారా లోకేష్ మెడకు ఫైబర్ నెట్ స్కాం… నారా బ్రాహ్మణినికి టిడిపి బాధ్యతలు ?