టీమిండియా ఫ్యాన్స్ కు మరో బిగ్ షాక్ తగలనుంది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ 2023 టోర్నమెంట్ కు ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం కానున్నారు. టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మరియు శ్రేయస్ అయ్యర్ ఈ ఇద్దరు ప్లేయర్లు గాయాల కారణంగా ఆసియా కప్ 2023 టోర్నమెంటుకు దూరం కానున్నట్లు సమాచారం అందుతోంది. వాస్తవానికి ఆసియా కప్ 2023 టోర్నమెంట్ ఆగస్టు 30వ తేదీ నుంచి… సెప్టెంబర్ 17వ తేదీ వరకు జరగనుంది.
Advertisement
ఈ టోర్నమెంట్ పూర్తి కాగానే అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ కూడా జరగనుంది. ఇలా వరుసగా టీమిండియా ప్లేయర్లు ఫుల్ బిజీ కానున్నారు. అయితే టీమిండియా కు ఆసియా కప్ కంటే వన్డే వరల్డ్ కప్ చాలా ఇంపార్టెంట్. అయితే పూర్తిగా కోలుకోని కేఎల్ రాహుల్ మరియు శ్రేయస్ అయ్యారు ను ఆసియా కప్ లో ఆడించి ఇబ్బంది పెట్టకూడదని… టీమిండియా భావిస్తోందట.
Advertisement
అందుకే వీరిద్దరని ఆసియా కప్ 2023 టోర్నమెంటుకు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలా చేస్తే వీరిద్దరూ వన్డే వరల్డ్ కప్ కు సిద్ధమవుతారని… దానివల్ల టీమిండియాకు మంచి ఫలితాలు వస్తాయని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మరియు శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ బెంగళూరు లోని ఎన్సీఏ సెంటర్ లో రికవరీ అవుతున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం బ్యాటింగ్ కూడా నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఏడాదిలోపే ఎందుకు తీస్తారో మీకు తెలుసా..!!
Naresh: రమ్య రఘుపతికి షాక్ ఇచ్చిన కోర్టు.. నరేష్ ఇంట్లోకి వెళ్లకుండా నిషేధం
మాకు బలుపు లేదు… కపిల్ దేవ్ కు జడేజా కౌంటర్ !