Ad
భారత వైస్ కెప్టెన్, ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక్కే మ్యాచ్ లో ఓ గొప్ప రికార్డ్ ఓ చెత్త రికార్డ్ అనేది తన పేరిట లికించుకున్నాడు. నిన్న తిరువనంతపురంలో సౌత్ ఆఫ్రికాతో మూడు టీ20 లలో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్ లో దీనిని సాధించాడు రాహుల్. అయితే గాయం నుండి కోలుకొని ఆసియా కప్ ముందు భారత జట్టులోకి వచ్చిన రాహుల్ చాలా నెమ్మదిగా ఆడుతున్న విషయం తెలిసిందే.
ఇక నిన్న సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కూడా రాహుల్ చాలా నెమ్మదిగా ఆడాడు. వన్డేల మాదిరి 56 బంతులు ఆది కేవలం 51 పరుగులే చేసాడు. దాంతో భారత జట్టు తరపున అతి తక్కువ స్ట్రైక్ రేట్ తో హాఫ్ సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా ఓ చేత రికార్డ్ ముఠా గట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో రాహుల్ స్ట్రైక్ రేట్ కేవలం 91.1 గా ఉంది. ఈ లిస్ట్ లో రాహుల్ తర్వాత గంభీర్, రోహిత్, కోహ్లీ వరుసగా ఉన్నారు.
అలాగే ఈ మ్యాచ్ లో సాధించిన ఇదే హాఫ్ సెంచరీతో రాహుల్ ఓ హొప్ప రికార్డుకు కూడా సాధించాడు. భారత జట్టు తరపున 11 అంతర్జాతీయ జట్ల పైన ఈ టీ20 ఫార్మాట్ లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. రాహుల్ అర్ధ శతకం చేసిన జట్లలో పాకిస్థాన్ మినహా ప్రపంచంలో పేరు పొందిన అన్ని జట్లు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :
ప్రపంచ కప్ నుండి బుమ్రా బయటకి..?
సంజూ భారత భవిష్యత్ అంటున్న దాదా..!
Advertisement