Home » కొరియాలో తీవ్ర ఆహార సంక్షోభం…న‌ల్ల‌హంస‌ల‌పై కిమ్ క‌న్ను…!

కొరియాలో తీవ్ర ఆహార సంక్షోభం…న‌ల్ల‌హంస‌ల‌పై కిమ్ క‌న్ను…!

by AJAY
Ad

ప్ర‌పంచంలో నియంత అధ్య‌క్షుడిగా పేరుతెచ్చుకున్న అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్. అత‌డి హెయిర్ స్టైల్ పాల‌నా విధానాలు అన్నీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. అయితే నియంత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు ఇప్పుడుపెద్ద సమస్య వచ్చి పడింది. నియంత దేశం ఉత్త‌ర‌ కొరియాలో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడింది. ఉత్తర కొరియా లో కరోనా మ‌హ‌మ్మారి విజృంభ‌న‌తో విధించిన ఆంక్షలు.. గతేడాది తుఫానుల కారణంగా ఏర్పడిన పరిస్థితులు ఇతర కారణాల వల్ల దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడినట్లు తెలుస్తోంది. దాంతో 2025 వరకు పౌరులంతా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలని దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పిలుపునిచ్చారు.

Advertisement

kim suggests to eat blak swans

kim suggests to eat blak swans

దేశంలో 2025 వ‌ర‌కూ ఆహార సంక్షోభం కొన‌సాగుతుంద‌ని చెప్పారు. అంతే కాకుండా ధాన్యం ఉత్పత్తి ప్రణాళికను నెరవేర్చడంలో వ్యవసాయరంగం పూర్తిగా విఫలమైందని.. అందువల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని ఆయ‌న‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక వచ్చే ఏడాది మేలో ఈ దేశంలో దాదాపు 10 లక్షల టన్నుల ఆహార కొరత రావచ్చని పొరుగు దేశం దక్షిణ కొరియా డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అంచనా వేస్తోంది. అంతే కాకుండా దేశంలో ఆహార ఆకలి చావులు నమోదయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. అయితే ఈ వార్తలను ఉత్తరకొరియా మాత్రం కొట్టిపారేసింది.

Advertisement

కానీ ఉత్తరకొరియా అధ్యక్షుడు మాత్రం ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికే కీలక సూచనలు చేశారు. దేశంలో తీవ్ర ఆహార సంక్షోభం నేపథ్యంలో లో దేశ ప్రజలకు న‌ల్ల హంస‌ల‌ను తినాలని కిమ్ జాంగ్ ఉన్ సూచించాడు. అంతేకాకుండా దీనిపై ప్రచారం కూడా మొదలు పెట్టాడు. న‌ల్ల‌ హంసలు ఎంతో రుచిగా ఉండటమే కాక ప్రొటీన్ అధికంగా ఉంటుందని అధ్యక్షుడు ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే దేశంలో నల్ల హంస‌ల‌ సంఖ్యను పెంచడం కోసం కిమ్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా ప్రారంభించాడు. న‌ల్ల హంస‌ల పెంపకానికి కేంద్రాన్ని కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Visitors Are Also Reading