ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు కిమ్ జోంగ్ ఉన్. సంపన్నదేశం అమెరికా దేశ అధ్యక్షుడు ఎంత పాపులరో అంతే కంటే కిమ్ కు ఎక్కువ పాపులారిటీ ఉంది. రాకెట్లు మిస్లైళ్లతో కిమ్ కు ఎంతో పేరు వచ్చింది. కిమ్ అధ్యుక్షుడిగా పాలన చేపట్టి దాదాపు పదేళ్లు గడుస్తోంది. 2011లో తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ మరణం తరవాత 27 ఏళ్ల వయసులోనే కిమ్ ఉత్తర కొరియో అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాడు. కిమ్ జోంగ్ ఇల్ కు మగ్గురు భార్యలు కాగా మూడో భార్య కుమారుడు కిమ్ జోంగ్ ఉన్. మూడో భార్య అంటే కిమ్ జోంగ్ ఇల్ కు చాలా ఇష్టమని దాంతోనే మూడో భార్య కుమారుడైన కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కాగలిగాడు. ఉత్తర కొరియోలో కిమ్ వంశాన్ని ప్రజలు దైవంగా భావిస్తారు.
Advertisement
Advertisement
కిమ్ జోంగ్ ఉన్ తాత పేరు కిమ్ ఇల్ సన్ ఆయనే ఉత్తర కొరియా వ్యవస్థాపకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అలా కిమ్ వంశం ఉత్తర కొరియాలో అధికారంలోకి వచ్చింది. ప్రపంచ దేశాల్లో కిమ్ నియంత అయినప్పటికీ ఉత్తర కొరియా ప్రజలు మాత్రం ఆయనను అభిమానిస్తారు. కిమ్ జోంగ్ ఉన్ పాలనలో కొన్ని సంచలనాలు సృష్టించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం…2017లో అమెరికాను సైతం నాశనం చేయగలిగే ఖండాంతర క్షిపణులను తయారు చేసినట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కిమ్ ల మధ్య మాటల యుద్దం జరిగింది. ఆ తరవాత మళ్లీ ఇద్దరూ చర్చల్లో కూర్చున్నారు.
సొంత బంధువులను చంపించడం ద్వారా కిమ్ అధికారం కోసం ఎవరినైనా చంపేస్తారనే ఆరోపణలు వచ్చాయి. తన మేనమామ జంగ్ సాక్ టీక్ ను…2017 లో కిమ్ సోదరుడు అంటే అతడి భార్య మరో కొడుకు హత్యకు గురయ్యాడు. అతడిని కూడా కిమ్ చంపించాడనే ఆరోపణలున్నాయి. అన్వాయుధాల కోసం కిమ్ ఆహార కొరతతో సొంత ప్రజలు చనిపోతున్నా చూస్తు కూర్చున్నారనే ఆరోపణలున్నాయి. కరోనా కారణంగా ఉత్తర కొరియాలో ఆహార సంక్షభం నెలకొంది…దాంతో కిమ్ ప్రజలకు స్వారీ చెబుతూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.