అందంగా బొద్దుగా ముద్దుగా ఉండే కుష్బూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సిమ్లా ఆపిల్ పండులా మెరిసిపోతూ సౌత్ ఇండస్ట్రీ ప్రజలను ఆకర్షించే డ్రీమ్ గర్ల్ గా ఉండిపోయింది. అలాంటి ముద్దుగుమ్మ ఇప్పుడు కాస్త బరువెక్కి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తుంది. కానీ ఒకప్పుడు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించేసింది. అలాంటి ఈ బ్యూటీ 50 ఏళ్ల వయసు వచ్చిన చెక్కుచెదరని చర్మ సౌందర్యంతో కుర్ర హీరోయిన్లకు చమటలు పట్టించేస్తుంది.
READ ALSO : విరూపాక్షలో ఈ అఘోరా పాత్ర హైలెట్ అవుతుందా…?
Advertisement
ప్రస్తుతం ఒకపక్క సినిమాలు, మరోపక్క షోలు జీవితము ఆనందంగా సాగిపోతుంది కుష్బూ లైఫ్. ఈ క్రమంలోనే గోపీచంద్ హీరోగా తెరకెక్కిన రామబాణం అనే సినిమా మరికొన్ని రోజుల్లో విడుదలవ్వనుండగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన కుష్బూ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కుష్బూ తాను స్టార్ హీరోయిన్ గా కెరియర్ సాగిస్తున్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది అని చెప్పాలి.
Advertisement
READ ALSO : విరాట్ అంకుల్… వమికాను డేట్ కు తీసుకెళ్లొచ్చా… బుడ్డోడి ప్లకార్డు వైరల్
మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణలతో రొమాన్స్ చేయడానికి ఎంతో ఇష్టపడతాను అంటూ కుష్బూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే కుష్బూ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి. అంతేకాకుండా తన క్రేజీ హీరో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ అంటూ తెలిపింది. ఇప్పటికీ నా దగ్గర అమితాబచ్చన్ పోస్టర్లు ఉన్నాయి అంటూ ఇక ఆయనపై ఉన్న అభిమానాన్ని తన మాటల్లో చెప్పేసింది కుష్బూ.
READ ALSO : Ileana :పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా….