ఎలాంటి విషాదం చోటు చేసుకోనప్పుడు కొన్ని ప్రమాదాలు కూడా నవ్వులు పూయిస్తాయి. అలాంటి ప్రమాదానికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ బట్టల షాపులో యజమాని తో కస్టమర్లు ప్రశాంతంగా కూర్చుని షాపింగ్ చేస్తున్నారు. ఒక డ్రెస్ చూసిన తరవాత మరో డ్రెస్ చూపించమంటూ మంచి డ్రెస్ ఎంపిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే అలాంటి సమయంలో సడెన్ గా ఓ బైక్ షాపులోకి దూసుకువచ్చింది. దాంతో అప్పటి వరకూ ప్రశాంతంగా షాపింగ్ చేస్తున్న కస్టమర్లు ఒక్క సారిగా షాక్ అయ్యారు. చూస్తుండగానే షాపులో కౌంటర్ కు ఢీ కొట్టి బైకు కింద పడిపోయింది. అంతే కాదు ఆ బైకు పై ఉన్న వ్యక్తి గాల్లో ఎగిరి టైబుల్ అవతలి వైపుకు పడిపోయాడు.
Advertisement
Advertisement
ఇక కొద్ది సేపటి వరకూ ఆ షాపులో ఉన్న వారికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానంత షాక్ లోకి వెళ్లి పోయారు. రోడ్డు పై నడవాల్సిన బండి షాపులోకి వచ్చిందేంటి అని ఆ షాక్ లోనే ఉన్నారు. అంతలోనే కౌంటర్ అవతల పడిపోయిన డ్రైవర్ పైకి లేచాడు. దాంతో షాప్ లో ఉన్న ఆడవాళ్లు బైక్ నడిపిన వ్యక్తిని తిడుతున్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ ఘటన ఎక్కడో వేరే దేశాల్లో లేదంటే వేరే రాష్ట్రాల్లో కూడా జరగలేదు. మన తెలంగాణలోని ఖమ్మం జిల్లా కేంద్రంలోనే చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న ఓ బట్టల షాపులోకి బైక్ దూసుకురావడం ఆ తరవాత సీసీ టీవీ ఫుటేజ్ ను బయట పెట్టగా ఆ ఘటన కాస్తా వైరల్ అవ్వడం జరింగింది.
ఇక ఈ వైరల్ వీడియోకు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. బైక్ నడిపిస్తున్న యువకుడి తండ్రి 5 నిమిషాల్లో ఇంట్లో ఉండాలని ఆర్డర్ వేశాడని అందుకే అంత ఆత్రంగా వెళుతూ షాపులోకి దూరాడని ఓ నెటిజన్ కామెంట్ చేసాడు. ఇక మరో నెటిజన్ అతడే షాపు యజమాని కస్టమర్లు వచ్చి వెయిట్ చేస్తున్నారని అందుకే అంత వేగంగా వచ్చి పడిపోయాడని కామెంట్ చేశాడు. ఇక ఆ బైకర్ ఎలా వచ్చి షాపులో పడ్డాడో గానీ ఒక్కో నెటిజన్ తమ క్రియేటివిటి తో ఒక్కో రీజన్ చెబుతున్నారు.