ప్రతి ఒక్కరూ వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గణపతిని పూజిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం గణపతి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అనే దానిలో గందరగోళం నెలకొంది. సెప్టెంబర్ 18న లేదా 19న ఎప్పుడు జరుపుకోవాలి అనే దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై తెలంగాణ విద్వత్సభ స్పష్టతనిచ్చింది.
శోభకృత్ నామ సంవత్సరంలో వినాయక చవితి పండుగను భాద్రపద శుక్ల చతుర్థి రోజున అంటే సెప్టెంబర్ 18 శుక్రవారం రోజున జరుపుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి నవరాత్రులు ప్రారంభించాలని స్పష్టతనిచ్చారు. వినాయక చవితి పండుగ విషయంలో గందరగోళం నెలకొనడంతో వర్గల్ విద్యాసంస్కృతి క్షేత్రంలో వందమంది పండితుల సమక్షంలో పండగ తేదీపై నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
Advertisement
ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది విద్వత్సభ. అయితే పండుగకి మరికొన్ని రోజుల సమయం ఉండడంతో హైదరాబాద్ వంటి చుట్టుపక్కల నగరాల్లో మండపాల ఏర్పాట్లు, వినాయక చవితి పండుగ ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. వినాయక చవితి ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులతో పాటు అవసరమైతే ఇతర రాష్ట్రాల పోలీసులను కూడా తీసుకొస్తామని వెల్లడించారు. వినాయక చవితి విషెస్2023, గ్రీటింగ్స్ మీ స్నేహితులు, బంధువుల కోసం ..!
ఇవి కూడా చదవండి
Samantha : సమంతను దారుణంగా మోసం చేశారు..పాపం కోట్ల నష్టం ?
Anushka : పాన్ ఇండియా లెవెల్లో అనుష్క మూవీ.. 14 భాషల్లో రిలీజ్.. హీరో ఎవరంటే?
Kushi : ఒకే దగ్గరే ఉండి ఎంజాయ్ చేస్తున్నారా..పాపం చైతూ ?