నందమూరి తారకరత్న 39 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఆకస్మాత్తుగా కన్నుమూయడం నిజంగా బాధాకరం. లోకేష్ పాదయాత్రలో పాల్గొనడం కోసం తారకరత్న జనవరి 27న కుప్పం వచ్చారు. ఒక మసీదులో ప్రార్థనలు నిర్వహించి బయటకు వస్తుండగా కొంతదూరం నడిచిన తర్వాత ఆయన ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కానీ ఆసుపత్రికి తీసుకెళ్లిన బతకలేకపోయారు. ఇక తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
READ ALSO : చిరంజీవితో కలిసి నటించిన ఈ అలనాటి హీరోయిన్ గుర్తుందా? ఆమె భర్త ఓ విలన్ ?
Advertisement
Advertisement
జీవితాంతం తోడుంటాడు అనుకున్న భర్త అర్ధాంతరంగా కన్నుమూయడంతో ఆమె ఆవేదన వర్ణనాతీతం. తారకరత్న అకాల మరణం అలేఖ్యను తీవ్రంగా కుంగదీసింది. తారకరత్న అంత్యక్రియల సమయంలో అలేఖ్యను ఓదార్చడం ఎవరి వల్ల కాలేకపోయింది. ఈ క్రమంలోనే అలేఖ్య రెడ్డికి కొంచెం మానసిక ఊరట కలిగించడం కోసం ఆమెను రాజకీయాలలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయనున్నారట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
తారకరత్న ఎక్కడైతే ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాలని అనుకున్నారో, అక్కడి నుంచి అలేఖ్య రెడ్డి చేత పోటీ చేయించాలని అనుకుంటున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే భర్త చనిపోయిన తర్వాత తొలిసారి స్పందించారు అలేఖ్య రెడ్డి. ఫిబ్రవరి 22న తారకరత్న పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
READ ALSO: Telugu News, Tollywood Movie News