Home » పెళ్లికి ఇచ్చే బంగారం, వస్తువులు కట్నంగా పరిగణించవచ్చా..? హైకోర్టు సంచలన తీర్పు …!

పెళ్లికి ఇచ్చే బంగారం, వస్తువులు కట్నంగా పరిగణించవచ్చా..? హైకోర్టు సంచలన తీర్పు …!

by AJAY
Ad

చట్టం ప్రకారం కట్నం తీసుకోవడం నేరం అన్న సంగతి తెలిసిందే. వరకట్నం అడిగినా పెళ్లి తరవాత ఎక్కువ కట్నం తీసుకురావాలని డిమాండ్ చేసినా భార్యలు ఫిర్యాదు చేయవచ్చు. అయితే తాజాగా భార్యా భర్తల కట్నం కేసులో కేరళ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లి సమయంలో భార్య కుటుంబ సభ్యులు ఆమె భద్రతకోసం పెట్టే ఆభరణాలు మరియు సామాన్లు కట్నం కింద రావని తీర్పునిచ్చింది. వధువు సంక్షేమం కోసం తల్లిదండ్రులు ఇచ్చే కానుకలు వరకట్న నిషేధ చట్టం 1961 కింద లెక్కించ రాదని జస్టిస్ అనిత సంచలన తీర్పు వెలువరించింది.

Advertisement

ఈ కేసు వివరాల్లోకి వెళితే…. కేరళకు చెందిన దీప్తి అనే మహిళాl 2020లో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కొంతకాలం బాగానే ఉన్న వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దాంతో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దీప్తి తన భర్త తనను కట్నం కోసం వేధించారని గౌరీ నోడల్ అధికారి ద్వారా తన భర్తకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలను ప్రారంభించారు. దాంతో ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరో వాద్యాన్ని భర్త దాఖలు చేశాడు. పిటిషనర్ తరఫున లాయర్లు ప్రదీప్, రష్మీ నాయర్ , బిజూ, అనూఫ్ వాదించారు.

Advertisement

also read :రోజుకు రూ.20 తో 40 ఏళ్ళ‌లో కోటీశ్వ‌రుడు అవ్వొచ్చు..ఎలాగంటే..?

భార్యకు ఆభరణాలను కట్నంగా ఇవ్వలేదని ఆమె భద్రత కోసం వారి కుటుంబ సభ్యులు బ్యాంకు లాకర్ లో ఇద్దరి పేరుమీద బ్యాంక్ లాకర్ లో ఉంచారని స్పష్టం చేశారు. కాబట్టి ఈ విషయంలో జిల్లా వరకట్న నిరోధక అధికారికి ఎలాంటి సంబంధం లేదని వాదించారు. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. తల్లిదండ్రులు ఆమె భద్రత కోసం లాకర్ లో ఇద్దరి పేరు మీద ఆభరణాలను ఉంచారని.. తాళం కూడా దీప్తి వద్ద ఉందని గుర్తించింది. కాబట్టి పెళ్లి సమయంలో ఇచ్చే కానుకలు భద్రత కోసం ఇచ్చే ఆభరణాలు కట్నంగా పరిగణించలేము అంటూ తీర్పునిచ్చింది.

Visitors Are Also Reading