కొందరు వ్యక్తులు కశ్మీరీ పండిట్ ల పేరుతో కోట్లు కొల్లగొడుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ….. బీజేపీ పై విమర్శల వర్షం కురిపించారు. కశ్మీర్ ఫైల్స్ పేరుతో కోట్లు కొల్లగొడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నేతలు ఏమో పోస్టర్లను అంటించే పనిలో ఉన్నారని అన్నారు. అగ్నిహోత్రి కాశ్మీరీ పండిట్ల పేరు చెప్పుకొని కోట్లు సంపాదించాడని కేజ్రీవాల్ ఆరోపించారు.
Advertisement
Advertisement
బిజెపి నేతలు ఈసినిమా ద్వారా చక్కగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలి…. ఇకనైనా కళ్లు తెరవాలని హితవు పలికారు. అంతేకాకుండా రీసెంట్ గా హర్యానాలో ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ఉచితంగా ప్రదర్శించడం నిలిపివేయాలని బీజేపీ నేతను దర్శకుడు అగ్నిహోత్రి కోరుతూ ట్వీట్ చేశారు.
దీనిపై కూడా కేజ్రీవాల్ స్పందించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా మార్చి 11 న విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమాపై దేశంలో దుమారం రేగుతోంది. 1990లో జమ్ము కాశ్మీర్ లో జరిగిన దారుణాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. కేవలం 13 రోజుల్లోనే ఈ సినిమా 200 కోట్లు వసూలు చేసింది. ఇక రీసెంట్ గా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ సినిమా పై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే.