టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వరస సినిమాలతో దోసుకుపోతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. దసరా సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ సినిమాలలో కూడా నటించి ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. అయితే తాజాగా నటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని, దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో ఈమె ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై కీర్తి తల్లిదండ్రులు స్పందించారు.
Advertisement
తనకు పెళ్లి చేసే సమయంలో అందరికీ తప్పకుండా చెబుతామని కీర్తి సురేష్ తల్లిదండ్రులు చెప్పారు. అంతేకాకుండా కీర్తి సురేష్ కూడా తన ఇన్ స్టా అకౌంట్ ద్వారా తన పెళ్లి వార్తలపై రియాక్ట్ అయ్యారు. తాజాగా కీర్తి సురేష్ కి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోలో కీర్తి సురేష్ నవ్వుతూ ఉంది. వెనకన ఒక వ్యక్తి కీర్తి సురేష్ తో ఎంతో సన్నిహితంగా ఉన్నాడు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాకుండా మెకానిక్ తో ప్రేమాయణం అనే క్యాప్షన్ జత చేశారు. ఈ వార్తలపై కీర్తి సురేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
షూటింగ్ సమయంలో ఎంతోమందితో ఫోటోలు దిగడం జరుగుతుంది. ఒక ఫోటో దిగినంత మాత్రాన ఇంత చెత్త కామెంట్లు చేస్తారా? అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి… చిన్న విషయాన్ని పెద్దది చేసి ఎందుకు ఇబ్బంది పెడతారు అని అంటున్నారు. భోళాశంకర్ సినిమా షూటింగ్ సమయంలో ఒక టెక్నీషియన్ ఫోటో దిగాడు. దాన్ని పట్టుకొని ఇంత అసభ్యకరంగా కామెంట్ చేయడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి ఇలాంటి కామెంట్లు పెడితే ఊరుకోము అని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ లో అరుదైన సంఘటన..భర్త లేకుండా నిహారిక, భార్య లేకుండా పవన్ ?
Ramcharan-Upasana: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
Upasana : మెగా కోడలు ఉపాసన ఆస్తుల విలువ ఎంతో తెలుసా…?