ప్రస్తుతం ఫుల్ స్వింగ్ మీద ఉన్న హీరోయిన్ మహానటి కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో కీర్తి సురేష్ టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో కీర్తి సురేష్ కు అదృష్టం కలిసి వచ్చింది. ఆ తరవాత వరుస ఆఫర్ లతో బిజీగా మారిపోయింది.
Advertisement
కేవలం లేడీ ఓరియెంట్ చిత్రాలలోనూ కీర్తి అదరగొడుతోంది. మహానటి సినిమాలో కీర్తి సురేష్ చేసిన పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. ఇక ఆ తరవాత కొనన్ని సినమిఆలలె పట, ఇక రీసెంట్ గా దసరా సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించి అలరించింది. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Advertisement
హిందీలో అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పింది. అంతే కాకుండా షారుక్ ఖాన్ పక్కన ఛాన్స్ వస్తే వదులుకోనని అతడి పక్కన నటించాలని ఉందని చెప్పింది. మరోవైపు తన పెళ్లి పై వస్తున్న వార్తల పై స్పందించింది. ఆ వార్తలను తరచూ చూస్తుంటానని చెప్పింది. అయితే వాటి గురించి చింతించడం మరియు ఆలోచించం మానేసానని చెప్పింది.ఇదిలా ఉంటే సెలబ్రెటీల పెళ్లి వార్తలు కామన్ గానే కనిపిస్తున్నాయి.