Home » ఈ మూడు వస్తువులు మీ ఇంట్లో ఉంటే.. డబ్బే డబ్బు..!

ఈ మూడు వస్తువులు మీ ఇంట్లో ఉంటే.. డబ్బే డబ్బు..!

by Sravya
Ad

Vastu Tips : వాస్తు ప్రకారం పాటించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. చక్కటి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ఈ మూడు వస్తువులను మీ ఇంట్లో ఉంచారు అంటే ఐశ్వర్యవంతులు అయిపోవచ్చు. చాలామంది ఇంట్లో పూజ గదిలో కూర్చుని పూజ చేస్తే సరిపోతుందని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి పూజ చేయడమే కాకుండా కొన్ని విషయాలను కచ్చితంగా పాటించాలి. అప్పుడు లైఫ్ అంతా కూడా బాగుంటుంది. చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇలా చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. ఏ ఇబ్బందులు కూడా రావు.

Advertisement

ప్రతీ ఒక్కరు కూడా నిత్యం ఇంట్లో పూజ చెయ్యాలి. మనం పూజ చేసేటప్పుడు కచ్చితంగా కొబ్బరికాయని వాడుతూ ఉంటాము. గుడికి వెళ్లేవారు కొబ్బరికాయని కొట్టి దేవుడికి తీసుకెళ్తూ ఉంటారు ఇంట్లో కొబ్బరికాయ ఉంచితే చాలా మంచిది అని పండితులు అంటున్నారు. కొబ్బరికాయకి పసుపు కుంకుమ రాసి పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఐశ్వర్యవంతులు అయిపోవచ్చు. ప్రతి గురువారం లక్ష్మీదేవికి ఒక పద్మాన్ని పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక ప్రతి గురువారం లక్ష్మీదేవికి ఒక పద్మాన్ని సమర్పించడం మర్చిపోకండి. లక్ష్మీదేవి ఒడిలో కమలం ఉండడం వలన జీవితంలో ఆర్థిక భద్రత స్థిరత్వం కలుగుతాయి.

Advertisement

అలానే ఇంట్లో కొద్దిగా కర్పూరం ని ఉంచండి. ఆర్థిక శ్రేయస్సు ఎప్పుడు మిమ్మల్ని వీడకుండా ఉంటుంది. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలని మరి వీటిని అనుసరించి ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండండి. ఇలా మీరు ఈ పద్ధతుల్ని కనుక పాటించారంటే, చక్కగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సుఖసంతోషాలతో ఉండొచ్చు. చాలామంది వాస్తు చిట్కాలని నమ్ముతుంటారు ఇలా పాటిస్తే జీవితాన్ని మార్చుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే లక్ష్మీదేవిని పూజించడం వలన తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే డబ్బులని సరిగ్గా ఖర్చు చేస్తూ ఉండాలి. డబ్బులని ఇష్టవచ్చినట్టు వృధా చేస్తే కూడా లక్ష్మీదేవి కి కోపం వస్తుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading