తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక రాజకీయంలో కీలక మార్పులు వచ్చాయి. అందులోనూ త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉండడంతో అన్ని పార్టీలు కూడా సిద్ధమయ్యాయి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ సరికొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రావడంతో సైలెంట్ అయిపోయింది కెసిఆర్ పార్టీ. లోక్ సభ ఎన్నికల్లో తన స్ట్రాటజీ తో సత్తా చాటాలని అనుకుంటుంది. ఎన్ని రోజులు తెలంగాణలో కాంగ్రెస్ బిజెపికి అంతలా ఆదరణ లేదు. తనకి దేశం రాజకీయాల నుండి మంచి పరపతి ఉండడంతో రాష్ట్ర రాజకీయాల్ని తమ కొడుకు కేటీఆర్ కి అప్పగించి, ఢిల్లీకి వెళ్దామని ప్లాన్ వేస్తున్నట్లు ప్రచారం జరిగింది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం అన్ని పూర్తిగా మారిపోయాయి.
Advertisement
ఇప్పుడు కేసీఆర్ కొత్త వ్యూహాన్ని అమలు చేసి ప్రత్యర్థులకి పోటీ ఇవ్వడమే కాకుండా పార్టీని దేశ రాజకీయాల్లో కూడా బలోపేతం చేయాలని అనుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల త్వరలో ఉండడంతో కేసీఆర్ పార్టీలో కీలక మార్పులు చేసేందుకు రెడీ అవుతున్నారు. లోక్సభ ఎన్నికలపై అసెంబ్లీ ఎన్నికల ప్రభావం పడటంతో కేటీఆర్ హరీష్ రావు లకి కొత్త బాధ్యతని అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అసెంబ్లీలో తాను లేకున్నా ప్రతిపక్ష పాత్ర గట్టిగా పోషించిన హరీష్ రావుకి పార్టీ పగ్గాలు అప్పచెప్పాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Advertisement
ప్రస్తుతం కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండగా హరీష్ రావుకి బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ అనుకుంటున్నారు. మాస్ లీడర్ గా మంచి పేరు ఉండడంతో పార్టీలో ఉన్న నేతలు అందరికీ హరీష్ రావు పై అభిప్రాయం బాగుంది. కేటీఆర్ ని లోక్సభ కి పంపాలని గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చే లోకసభ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసి దేశ రాజకీయాల్లోకి వెళ్తారని ప్రచారం సాగింది ప్రస్తుతం అయితే రాష్ట్ర రాజకీయాల మీద ఫోకస్ పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో లోక్సభ సీట్లలోనూ బిఆర్ఎస్ పోటీ చేయాలని అనుకుంటోంది. కేటీఆర్ కి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!