కస్తూరి శంకర్ కి ఊరట కలిగింది. తెలుగు వాళ్ళ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆమె హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు చెన్నై జైల్లో ఉన్న కస్తూరికి ఊరట కలిగింది. ఎగ్మూర్ కోర్టు బెయిల్ ఇచ్చింది. హైదరాబాదులో అరెస్ట్ చేసిన తర్వాత ఆమెని ఎగ్మూర్ కోర్టులో హాజరు పరిచారు 14 రోజుల రిమాండ్ ని విధించారు. నవంబర్ 29 దాకా రిమాండ్ ఇచ్చారు. ఆమెను చెన్నైలోని సెంట్రల్ జైలుకి తరలించారు.
Advertisement
ఆమె బెయిల్ కోరింది. ఒంటరితల్లని, తనకి స్పెషల్ చైల్డ్ ఉందని పాప బాగోగులు చూసుకోవడానికి ఎవరూ లేరని ఆమె బెయిల్ కోరారు. దీంతో కోర్టు కస్తూరికి పలు షరతులతో బెయిల్ ఇచ్చింది. మూడవ తేదీన చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన కస్తూరి తమిళనాడులో స్థిరపడిన తెలుగు వాళ్లపై కామెంట్స్ చేశారు.
Advertisement
Also read:
కస్తూరి చేసిన వ్యాఖ్యలకు తెలుగు సంఘాలు మండిపడ్డాయి. చెన్నైలో ఆమెపై కేసులు పెట్టడంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఇచ్చింది. రిమాండ్ ఖైదీగా ఉన్న కస్తూరికి బెయిల్ మంజూరు అవ్వడంతో విడుదలయ్యారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!