Home » నాకు ప్రాణ హాని ఉంది..కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు..!

నాకు ప్రాణ హాని ఉంది..కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు..!

by AJAY
Ad

వివాదాస్పద నటి కరాటే కళ్యాణి తరచూ ఏదో ఒక విధంగా వార్తలో నిలుస్తూ ఉంటుంది. తాజాగా కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో తనకు ప్రాణహాని ఉందంటూ కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది. ఈ మధ్యనే నా రెండు కారు టైర్లను గుర్తుతెలియని వ్యక్తులు కోసేసారు అంటూ ఆరోపించింది. తాను ఈ మధ్యన హిందుత్వ వాదులతో కలిసి ఓ గుడి దగ్గర గొడవ జరుగుతుంది అంటే వెళ్లానని చెప్పింది.

Advertisement

కారులో వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు కార్ టైర్ ఒక్కసారిగా పేలిపోయింది అని చెప్పింది. బండిని మెకానిక్ కు చూపించగా అతడు మీ కార్ టైర్లు ఎవరో కావాలనే కోసేశారు అని చెప్పాడని వెల్లడించింది. అదే టైర్ హైవేపై పేలి ఉంటే ఘోర ప్రమాదం జరిగేదని కరాటే కళ్యాణి ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

తన మీద కోపంతోనే కావాలని ఎవరో అలా చేశారని ఆరోపించింది. తనకు ప్రాణహాని ఉందని చెప్పింది. ఇది ఇలా ఉంటే కరాటే కళ్యాణి ఖమ్మంలో కృష్ణుడి రూపంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును ఖండించిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ సినిమాల్లో నటించారు… గొప్ప పాత్రల్లో మెప్పించారు అలా అన్ని పాత్రలలో అన్ని వేషాలతో విగ్రహాలు ఏర్పాటు చేస్తామా అని ప్రశ్నించింది. కృష్ణుని రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదు అంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. దాంతో కరాటే కళ్యాణిని మా అసోసియేషన్ నుండి తొలగించడంతోపాటు ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు.

Visitors Are Also Reading