Home » అందుకే విడాకులు తీసుకున్నా, ప్రేమ‌కోసం తపిస్తున్నా….న‌టి కరాటే క‌ళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

అందుకే విడాకులు తీసుకున్నా, ప్రేమ‌కోసం తపిస్తున్నా….న‌టి కరాటే క‌ళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

by AJAY
Ad

క‌రాటే క‌ల్యాణి టాలీవుడ్ లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. న‌టిగా కంటే వివాదాల‌తోనే క‌రాటే క‌ల్యాణి ఎక్కువ మందికి తెలిసింది అన‌డంలో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు. క‌రాటే క‌ల్యాణి వంద‌కు పైగా చిత్రాల‌లో న‌టించింది కానీ ఆంజ‌నేయులు సినిమాలో ఆమె చేసిన బాబీ పాత్ర‌తో ఎక్కువ పాపుల‌ర్ అయ్యింది. ఈ సినిమాలో బ్ర‌హ్మికి సెట‌ప్ గా న‌టించి బాబీ అంటూ త‌న డైలాగ్ తో ఆక‌ట్టుకుంది.

Advertisement

ఇక సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే క‌ల్యాణి రోజుకో వివాదంతో వార్త‌ల్లో నిలుస్తూ ఉంటుంది. ఇటీవ‌ల ఓ యూట్యూబ‌ర్ పై దాడి చేసి వార్త‌ల్లో నిలిచింది. అప్ప‌ట్లో ఓ వ్య‌క్తి త‌న‌ను క‌రాటే క‌ల్యాణి బ్లాక్ మెయిల్ చేస్తుందంటూ పోలీసులను ఆశ్ర‌యించాడు. మ‌రోవైపు క‌రాటే క‌ల్యాణి సేవా కార్య‌క్ర‌మాలు కూడా చేస్తూ వీడియోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది.

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో క‌రాటే క‌ల్యాణి త‌న జీవితంలో జ‌రిగిన చేదు అనుభ‌వాల‌ను వెల్ల‌డించింది. త‌న వైవాహిక ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి చాలా విష‌యాలు చెప్పుకొచ్చింది. త‌న‌కు పెళ్లై విడాకులు అయిన‌ట్టు క‌రాటే క‌ల్యాణి స్ప‌ష్టం చేసింది. త‌న‌లో చాలా మంది బాబీనే చూస్తారు కానీ నాణేనికి మ‌రోవైపు ఉన్న‌ట్టు త‌న‌లో సాయం చేసే గుణం కూడా ఉంద‌ని చెప్పింది.

రియ‌ల్ లైఫ్ లో చాలా మందికి సాయం చేశాన‌ని తెలిపింది. అంతే కాకుండా త‌న‌కు పెళ్లై విడాకులు అయ్యాయ‌ని చెప్పింది. పెళ్ల‌య్యాక చాలా క‌ష్టాలు అనుభ‌వించాన‌ని భ‌ర్త పెట్టిన టార్చ‌ర్ మాట‌ల్లో చెప్ప‌లేన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. బేగంపేట వద్ద న‌డీ రోడ్డు పై త‌న భ‌ర్త బ‌ట్ట‌లు లాగేసి దారుణంగా హింసించాడ‌ని చెప్పింది. అలా చాలా జ‌రిగాయ‌ని చెప్పింది. అయిన‌ప్ప‌టికీ అత‌డిలో మార్పు రాలేద‌ని చివ‌రికి విడాకులు తీస‌కున్నాన‌ని తెలిపింది. నిజ‌మైన ప్రేమ కోసం త‌పిస్తున్నాన‌ని మంచి వ్య‌క్తి దొరికితే మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పింది.

Visitors Are Also Reading