ప్రస్తుతం కన్నడ సినిమాల హవా కనిపిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కేజీఎఫ్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై రికార్డులు క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇప్పుడు కాంతార సినిమా కూడా అలాంటి విజయాన్నే సొంతం చేసుకుంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన కాంతార సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.
Advertisement
మొదట ఈ సినిమాను కన్నడలోనే విడుదల చేశారు. ఆ తర్వాత సూపర్ హిట్ టాక్ రావడం టాలీవుడ్ స్టార్స్ ప్రశంసలు కురిపించడంతో తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు రెండు వందల కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ సినిమాను ఓ ప్రాంతంలోని దేవతల నేపథ్యంలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సినిమాలో పంజర్లి, గులిగ అనే దేవతలను చూపించారు.
Advertisement
అయితే ఇప్పుడు పంజర్లి అంటే ఏంటి.? అన్న విషయాన్ని తెలుసుకుందాం. పంజర్లి అనేది భూత కోలాలో భాగంగా పూజించబడే మగ అడవి పంది యొక్క దైవిక ఆత్మ పేరు. తులునాడులోని ప్రాచీన దేవతలలో పంజర్లి కూడా ఒకటి. తులునాట పంజర్లీని ఎక్కువగా పూజిస్తారు. పండించిన పంటలో మొదట కొంత భాగాన్ని దేవతలకు నైవేద్యంగా పెడతారు.
పంటను కాపాడినందుకు కృతజ్ఞతలు తెలుపుతారు. ఇక ఈ దేవత కథ విషయానికి వస్తే…. ఓ రైతు తన పంటచేనులో అడవి పందులు పంటను నాశనం చేస్తున్నాయని ఓ అడవిపందిని వేటాడి చంపారట. ఆ తర్వాత అడవి పంది ఆత్మ దర్శనం ఇవ్వగా ఆ తర్వాత నుండి పూజించడం ప్రారంభించారు. అలా పంజర్లి దేవతను ఆరాదించడం మొదలయ్యింది.