Home » కమల్ హాసన్ “విక్రమ్” సినిమా రివ్యూ అండ్ రేటింగ్….సినిమాలోని హైలెట్స్ ఇవే….!

కమల్ హాసన్ “విక్రమ్” సినిమా రివ్యూ అండ్ రేటింగ్….సినిమాలోని హైలెట్స్ ఇవే….!

by AJAY
Ad

సినిమా – విక్రమ్

దర్శకుడు – లోకేష్ కనకరాజు

Advertisement

నటీనటులు – కమల్ హాసన్ ఫాసిల్ విజయ్ సేతుపతి కాళిదాస్ జయరామ్, నరైన్ , అర్జున్ దాస్ మరికొందరు.

ఖైదీ సినిమాతో దర్శకుడు లోకేష్ కనకరాజు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. రీసెంట్ గా లోకేష్ కనకరాజు మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ఇక ఇప్పుడు ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించిందా లేదా..? ఇప్పుడు చూద్దాం.

కథ

నగరంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. హత్యలు చేస్తున్న బృందమే వీడియో తీసి పోలీస్ డిపార్ట్మెంట్ కు పంపుతూ ఉంటుంది. అది పోలీస్ డిపార్ట్మెంట్ కు పెద్ద సవాల్ గా మారుతుంది. దాంతో ప్రభు ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ గా అమర్ ( ఫాహద్ ఫాజిల్) ను నియమిస్తారు. అమర్ ఇన్వెస్టిగేషన్ లో విక్రమ్ (కమల్ హాసన్) గురించి సంచలన నిజాలు బయట పడతాయి. అసలు ఈ విక్రమ్ ఎవరు..? నగరంలో జరుగుతున్న వరుస హత్యలకు విక్రమ్ కు సంబంధం ఏంటి.. అనేదే ఈ సినిమా మా కథ.

Advertisement

విశ్లేషణ :

ఈ సినిమాలో కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సూర్య లాంటి ప్రముఖ హీరోలు నటించడంతో ముందు నుంచి సినిమాకు హైప్ ఉంది. ఇక వారి వారి పర్ఫార్మెన్స్ తో హీరోలు అదరగొట్టారు. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంట్రో సీన్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంటర్వెల్ లో ఉండే ట్విస్ట్ కూడా ప్రేక్షకులకు సెకండాఫ్ పై మరింత ఆసక్తిని పెంచుతుంది. సినిమాలో ముఖ్యంగా కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ క్యారెక్టర్లు ఓ రేంజ్ లో ఉంటాయి. ఫస్ట్ హాఫ్ తర్వాత ప్రేక్షకులకు సెకండాఫ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ అంచనాలను రీచ్ అయినప్పటికీ సెకండ్ హాఫ్ కాస్త లాగ్ అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి మళ్లీ సినిమాను దర్శకుడు కాక రాజు ఓ రేంజ్లో లేపాడు. ఈ సినిమాను ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లలో ఎంజాయ్ చేయవచ్చు. ఈ చిత్రంతో కమల్ హాసన్, లోకేష్ కనగరాకు ఖాతాలో మరో సూపర్ హిట్ పడింది.

Also read :

‘మేజర్’ రివ్యూ అండ్ రేటింగ్ ! సినిమాలో ప్లస్ పాయింట్స్ అవేనా ?

Visitors Are Also Reading