కమలహాసన్… ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు అంటూ ఎవరు ఉండరు. ఈయన సినిమాలంటే ప్రేక్షకుల్లో ఇప్పటికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే కమల్ నటించే ప్రతి సినిమాలో కూడా ఆయన పాత్ర విభిన్నంగా ఉండే విధంగా ఎంచుకుంటారు. కొన్ని సినిమాలు కమర్షియల్ హిట్ సాధించక పోయిన రెగ్యురల్ ఫార్మాట్ లో కాకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఆయన ఏ పాత్ర చేసిన దానిలో పరకాయ ప్రవేశం చేసారు.
Advertisement
కమల్ హాసన్ అనేక భాషలో విభిన్నమైన పాత్రలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ్ లో కమల్ నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో సైతం డబ్ అయ్యి సక్సెస్ సాధించేవి. అలా తమిళంలో విడుదలైనా అవ్వాయి షణ్ముగి సినిమాను తెలుగులో భామనే సత్య భామనే గా విడుదల చేశారు. ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర కుమార్తె కోసం బామ్మ వేషంలోకి మారి.. మామగారింట్లో పాపకు ఆయాగా చెరతాడు. ఈ మూవీలో కమల్ డ్యూయెల్ రోల్ నటించారు.అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ కూతురిగా నటించిన చిన్నారి అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది..? ఈ సినిమా లో ఆ చిన్నారి తల్లిదండ్రులను కలపడానికి తాపత్రయపడే బిడ్డగా బాగా నటించింది.
కమలహాసన్ కూతురుగా నటించిన చిన్నారి పేరు అన్ అలెక్సియా. 1996లో విడుదలైన భామనే సత్య భామనే సినిమాకు గాను ఆ ఏడాది తమిళనాడు ప్రభుత్వం నుండి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు దక్కింది. ఆ తర్వాత హిందీలో కూడా సునీల్ శెట్టి,అక్షయ్ కుమార్, పరేష్ రావల్ హిట్ మూవీ హేరా ఫేరీలో కూడా ఈ పాప కనిపించింది.
ఇక ఆ తర్వాత సినిమాల నుండి దూరమైన ఆ చిన్నారి ఇప్పుడు ఎంటర్ ప్రెన్యూర్‌గా రాణిస్తోంది. కొంతకాలంగా ఈమె సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి.