మెగాస్టార్ చిరంజీవి నటవారసుడుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో రామ్ చరణ్. చిరుత సినిమాతో రామ్ చరణ్ టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. పూరిజగన్నాత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక మగధీర సినిమాతో రామ్ చరణ్ స్టార్ హీరోగా ఎదిగారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాతో తనలోని నటుడిని పరిచయం చేశారు. డ్యాన్స్ లో నటనలో చరణ్ తండ్రికి తగ్గతనయుడు అనిపించుకున్నాడు. ఇక రామ్ చరణ్ లో మరో కోణం కూడా ఉన్న విషయం చాలా మందికి తెలియదు.
Advertisement
కష్టాలలో ఉన్నవాళ్లకు రామ్ చరణ్ తనవంతు సాయం చేస్తుంటారు. మెగాస్టార్ తన ట్రస్ట్ ద్వారా ఎంతో మంది రక్తదానం, నేత్రందానం లాంటి సేవా కార్యక్రమాలు చేపడితే చరణ్ తనకు తోచిన సాయం చేస్తూ గొప్పమనసు చాటుకుంటున్నారు. తాజాగా నటుడు కాదంబరి కిరణ్ రామ్ చరణ్ గురించి ఓ పోస్ట్ పెట్టారు. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ భార్య అనారోగ్యంతో పోరాడి మృతి చెందితే రామ్ చరణ్ రూ.2లక్షలు సాయం చేసినట్టు తెలిపారు. రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించారు.
Advertisement
కాదంబరి కిరణ్ తన పోస్ట్ లో….రాంచరణ్! అందరికీ తెల్సి..ఒక పెద్ద స్టార్,మెగాస్టార్(మా అన్న) కొడుకు. కానీ నాకు తెలిసి ఒక మనసున్న మనిషి! భక్తి ,ప్రేమ,గౌరవం..ఇలాంటి విలువలు తెల్సిన మనిషి. సాటి మనిషిని మనిషిగా చూసే వ్యక్తిత్వం అతనిది. గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే,ఆమె డెడ్ బాడీ తీసుకోవడానికి ఆసుపత్రి కి చెల్లించడానికి డబ్బుల్లేకపోతే సుకుమార్ అన్న చొరవతో రాంచరణ్ ని అడుక్కొని 2లక్షలు తీసుకుని మనం సైతం ద్వారా ఆ కార్యక్రమం పూర్తిచేసాను.
అవికాక సుక్కన్న,మనం సైతం* ,విజయ్ అన్న,రాము తదితరుల వద్ద 1,20,000/- పోగుచేసి చనిపోయినామె పాప(18 నెలల) పేరున FD చేయమని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు..ఇన్నిరోజుల తర్వాత నేనుఎదురు పడితే రాంచరణ్ “ఆపాప ఎలావుంది కాదంబరి గారూ?”అని అడిగాడు. అతని వ్యక్తిత్వానికి నాకు గుండె నిండిపోయింది. బంగరు చెంచాతో పుట్టడం వేరు, బంగరు మనసుతో బతకడం వేరు. ప్రియ చరణ్! నీకు భగవదాశీస్సులు. అంటూ పేర్కొన్నారు. ఇక ఈ పోస్టును నటుడు బ్రహ్మాజి షేర్ చేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి చదవండి :
అమ్మ-నాన్న చదువులు, వైద్యవృత్తిలో ఉండగా.. అమ్మమ్మ తనను పెంచిందంటోన్న ప్రియాంక చోప్రా
సైకిల్‌పై డెలివరీ చేసిన జొమాటో బాయ్.. 4 గంటల్లోనే బైక్ కొనిచ్చిన కస్టమర్..! ఎలాగో తెలుసా..?