ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రులో అద్భుతంగా నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Advertisement
ఇక ఎన్టీఆర్ నందమూరి వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బ్రహ్మశ్రీ విశ్వామిత్ర అనే హిందీ సినిమాలో మొదటగా నటించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తాతగారు నందమూరి తారక రామారావు బాబాయి బాలకృష్ణ కూడా నటించారు. కానీ ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.ఇక పెరిగి పెద్దవాడైన తర్వాత ఎన్టీఆర్ నిన్ను చూడాలని అనే సినిమాతో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేదు.
Advertisement
కానీ ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ పేరు మార్మోగిపోయింది. అంతేకాకుండా ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తిరిగి వెనక్కి చూసుకోలేదు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. మరోవైపు ప్రకటనలు, వ్యాపారాల ద్వారా కూడా సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆస్తి విలువ దాదాపు 440 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
అయితే ఈ ఆస్తి మాత్రమే కాకుండా ఎన్టీఆర్ కు వారసత్వంగా కూడా కొన్ని ఆస్తులు వచ్చాయని రీసెంట్ గా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్టీ రామారావు తనయుడు హరికృష్ణ కు తండ్రి ద్వారా నిమ్మకూరులో 5 ఎకరాల ల్యాండ్ వారసత్వంగా వచ్చిందట. ఇక ప్రస్తుతం ఆ ల్యాండ్ తండ్రి ద్వారా ఎన్టీఆర్ కు వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా 2005లో ఆ ల్యాండ్ ఎకరం విలువ ఐదు లక్షలు అయితే ప్రస్తుతం దాని ధర ఎకరానికి కోటి 50 లక్షల పైగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఒకప్పుడు కొడాలి నాని ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ కానీ కొడాలి వైసీపీ లో చేరిన తర్వాత ఎన్టీఆర్ తో గ్యాప్ వచ్చింది.