టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 1999 సంవత్సరంలోనే… వన్డే మ్యాచ్ లలో… అంతర్జాతీయ క్రికెట్ మొదలుపెట్టిన వీరేంద్ర సెహ్వాగ్.. 2001 సంవత్సరంలో టెస్టుల్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. అప్పట్లో వీరేంద్ర సెహ్వాగ్ అంటే బౌలర్లకు హాడలెత్తేది. ఆయన బ్యాటింగ్ కు దిగితే బౌలింగ్ వేయడానికి కూడా బౌలర్లు భయపడేవారు. తన టెస్ట్ కెరీర్లో అత్యధికంగా 319 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు వీరేంద్ర సెహ్వాగ్.
Advertisement
ఇటు వన్డే మరియు టి20 లో కూడా ఓపెనర్ గా దిగి సిక్స్ లు, భీకరమైన ఫోర్లు కొట్టగల బ్యాట్స్మెన్ గా పేరు పొందాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇలాంటి తరుణంలోనే డ్యాషింగ్ ఓపెనర్ అనే పేరు కూడా తెచ్చుకున్నాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇక 2013 సంవత్సరంలో తన అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్ ప్రస్తుతం… కామెంటేటర్ గా వర్క్ చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2002 సంవత్సరంలో జరిగిన నాట్ వెస్ట్ ట్రోఫీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
Advertisement
ఈ టోర్నమెంట్ సందర్భంగా భారత హెడ్ కోచ్ జాన్ రైట్ తన కాలర్ పట్టుకుని… చైర్ పైకి తోసేసాడని ఆరోపణలు చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. ఆ టోర్నమెంట్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో… తాను తొందరగా అవుట్ కావడం వల్ల… కోచ్ జాన్ రైట్ ఇలా వ్యవహరించాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. అయితే ఓ తెల్లోడు తనపై చేయి చేసుకోవడంపై వీరేంద్ర సెహ్వాగ్ కు విపరీతంగా కోపం వచ్చిందట. అయితే అప్పటి టీం మేనేజర్ జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగిందట. ఈ విషయాన్ని స్వయంగా వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే ఇలాంటి వివాదం ఈ మధ్యకాలంలో జరిగితే… కచ్చితంగా ఆ కోచ్ పై బీసీసీఐ చర్యలు తీసుకుంటుందని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి
వరుస గాయాలు.. క్రికెట్ కు బుమ్రా రిటైర్మెంట్ ?
సమంత చికిత్స కోసం స్టార్ హీరో 25 కోట్ల ఆర్థిక సహాయం… క్లారిటీ ఇదే !
“రన్ రాజా రన్” హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా…?