Home » Joginder Sharma : ప్రమాదంలో టీ20 వరల్డ్‌కప్‌-2007 హీరో !

Joginder Sharma : ప్రమాదంలో టీ20 వరల్డ్‌కప్‌-2007 హీరో !

by Bunty
Ad

 

మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007లో భారత్ తొలి టీ-20 ప్రపంచకప్ గెలిచింది. తొలిసారి జట్టు పగ్గాలు చేపట్టిన కెప్టెన్ ధోని తన అద్భుత కెప్టెన్సీతో జట్టును ముందుకు నడిపించాడు. టోర్నీలో టీమిండియాను ఫైనల్ కు చేర్చి ఫైనల్ లో తన మార్కును చూపించాడు. ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా పాకిస్తాన్ తో హోరాహోరీగా పోరాడుతోంది. అప్పటికే మ్యాచ్ పాకిస్తాన్ చేతిలోకి వెళ్లిపోయింది. చివరి ఓవర్ ను ధోని జోగేంద్రశర్మతో వేయించాడు. 4 బంతుల్లో పాక్ 6 రన్స్ సాధించాల్సి ఉంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ధోని ఇన్పుట్స్ తీసుకొని అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.

Advertisement

జోగేంద్రశర్మ వేసిన మూడవ బంతికి ప్రమాదకరమైన మిస్ బౌల్ ఉల్ హాక్ ను మిస్ చేశాడు. దాంతో జోగేంద్రశర్మ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత జోగేంద్ర ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ లో రాణించాడు. 2010-11 సీజన్లలో జోగేంద్రశర్మ చెన్నైకి ప్రాతినిధ్యం వహించాడు. టీమిండియా క్రికెట్ కు అందించిన సేవలకుగాను జోగేంద్రశర్మకు 2011లో హర్యానా ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో పోలీస్ ఉద్యోగం ఇచ్చింది. హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న జోగేంద్ర శర్మ ఓ హ**త్యకేసులో ఇన్వాల్వ్ అవడంతో ఈ మాజీ క్రికెటర్ పై ఎఫ్ఐఆర్ నమోదయింది.

జనవరి 1న కిస్సార్ లోని దళిత కుటుంబానికి చెందిన పవన్ అనే వ్యక్తి ఆత్మ***త్య చేసుకున్నాడు. ఆస్తి వివాదాల కారణంగానే అతడు ఆత్మ***త్య చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే పవన్ కుటుంబం మాత్రం ఆత్మహత్య వెనుక పోలీసుల హస్తం ఉందని ఆరోపించింది. పైగా ఆస్తి వివాదంపై మూడేళ్ల క్రితం జోగేంద్రశర్మకు ఫిర్యాదు చేసినా….ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయనపై అధికారులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.

Advertisement

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading