టీమిండియా వెటరన్ క్రికెటర్ జోగిందర్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టి20 ప్రపంచ కప్-2007 హీరో, టీమిండియా వెటరన్ క్రికెటర్ జోగిందర్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మట్ల నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించాడు. ఈ విషయాన్ని జోగిందర్ తన ట్విట్టర్లో ప్రత్యేక లేఖ ద్వారా పంచుకున్నాడు.
Advertisement
టీమిండియాకు ఆడడం తనకు దక్కిన గౌరవమని, ఇందుకు సహకరించిన బీసీసీకి కృతజ్ఞతలు అని చెప్పాడు. ప్రస్తుతం కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. కాగా జోగిందర్ రిటైర్మెంట్ తో 2007 టీ20 వరల్డ్ కప్ ఆడిన భారత జట్టులో దినేష్ కార్తీక్, రోహిత్ శర్మ మాత్రమే మిగిలారు. వీరిలో దినేష్ కార్తీక్ 2022 టి20 వరల్డ్ కప్ ఆడగా, రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ గా ఉన్నాడు.
Advertisement
“ఇంటర్నేషనల్ సహా అన్ని రకాల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. 2002 నుంచి 2017 వరకు సాగిన నా క్రికెట్ జర్నీలో ఎన్నో ఏళ్లు అద్భుతంగా గడిచాయి. టీమ్ ఇండియాకు ఆడటం నేను సాధించిన గొప్ప గౌరవం. ఈ అవకాశం కల్పించిన బీసీసీకి కృతజ్ఞతలు. అలాగే ఐసీసీ తొలిసారి నిర్వహించిన టి20 ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉండడం నా అదృష్టం. ఆరోజు ధోని నన్ను నమ్మి బంతిని చేతిలో పెట్టడం, ఒత్తిడిలో బౌలింగ్ చేసి టీమ్ ఇండియాను గెలిపించడం ఎప్పటికీ మరిచిపోను. ఇక దేశవాళి క్రికెట్లో నాకు సహకరించిన హర్యానా క్రికెట్ అసోసియేషన్ కు ప్రత్యేక ధన్యవాదాలు” అంటూ జోగిందర్ ట్వీట్ చేశాడు.
Read Also : అన్న కొడుకు కోసం బాలయ్య తపన.. కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి
Announced retirement from cricket Thanks to each and everyone for your love and support 🙏❤️👍👍 pic.twitter.com/A2G9JJd515
— Joginder Sharma 🇮🇳 (@MJoginderSharma) February 3, 2023