ఆసియా కప్ తర్వాత ఇండియా మరో వన్డే సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ను ఈ నెల 22న ఆడనుంది. వరల్డ్ కప్ ముందు ఇది ఒక ప్రాక్టీస్ సిరీస్ గా ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇక మొదటి వన్డే సెప్టెంబర్ 22న మొహాలీలో జరగనుండగా, రెండవ వన్డే సెప్టెంబర్ 24న ఇండోర్ లో జరుగుతుంది. ఇక చివరి వన్డే సెప్టెంబర్ 27న రాజ్ కోట్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లో అన్ని డే అండ్ నైట్ మ్యాచ్లు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ లో 1:30 నిమిషాల తర్వాత ప్రారంభమవుతాయి. ఇక ఆసీస్ తో జరిగే ఈ మూడు వన్డేలకు ఈ వారంలోనే భారత జట్టును ప్రకటిస్తున్నారు.
ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం వరల్డ్ కప్ కు సెలెక్ట్ అయిన జట్టునే ఆసీస్ సిరీస్ కు కూడా ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సిరీస్ ఆడబోయే ప్లేయర్లలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, రవీందర్ జడేజా, అక్షర పటేల్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ లకు ఉండే ఛాన్స్ ఉంది. ఇక సంజు శాంసన్ ను బ్యాకప్ ప్లేయర్స్ గా తీసుకునే ఛాన్స్ ఉంది.
Advertisement
Advertisement
ఇక వరల్డ్ కప్ ముందు జరిగే ఆఖరి సిరీస్ కాబట్టి ఆసీస్ మీద విజయం సాధించడం టీం ఇండియాకు చాలా అవసరం. ఈ సిరీస్ గెలిస్తే వరల్డ్ కప్ లో స్ట్రాంగ్ గా ఎంట్రీ ఇవ్వడానికి రోహిత్ శర్మకు అవకాశం ఉంటుంది. సిరీస్ ఓడిపోతే వరల్డ్ కప్ లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఈ సిరీస్ లో టీమిండియా టపార్డర్ ఎక్కువగా సత్తా చాటాలి. రోహిత్, గిల్, కోహ్లీ, రాహుల్ తాము పూర్తి ప్రతిభను బయటకు తీయాలి. అప్పుడే ఆసీస్ మీద టీమిండియా పైచేయి సాధించే వీలు ఉంటుంది. ఆసీస్ కూడా వన్డే ఫార్మాట్లో వరుసగా విజయాన్ని సాధిస్తూ టాప్ లో ఉంది. మరి ఈ రెండు జట్ల మధ్య జరిగే సిరీస్ లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. ఇక ఇండియా-ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్ ను జియో సినిమా లోఫ్రీ గా చూసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
- Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ కు మళ్ళీ గాయం…. వరల్డ్ కప్ కు దూరం !
- NTRకు వెన్నుపోటు పొడిచిoది కూడా ప్రజల కోసమేనా అమ్మా? – చంద్రబాబు భార్యపై పోసాని సెటైర్లు
- చంద్రబాబును శుక్రవారమే రోజున ఎందుకు అరెస్టు చేశారో తెలుసా..? దీని వెనుక ఇంత కుట్ర ఉందా !