ఇండియావ్యాప్తంగా ఈనెల 24వ తేదీ నుంచి మొదటి విడత జేఈఈ మెయిన్ ప్రారంభం కానుంది. దేశంలోనే ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోంది మొత్తం 290 నగరాలు/ పట్టణాలతో పాటు ఇతర దేశాల్లోని 18 నగరాల్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 24, 25, 29, 30, 31 వ తేదీలతో పాటు ఫిబ్రవరి 1న బిటెక్ లో ప్రవేశానికి పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు.
Advertisement
ఈ పరీక్ష ర్యాంకుతో ఎన్ఐటీల్లో చేరే అవకాశం ఉంటుంది.అదేవిధంగా బిఆర్క్, బి ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 పరీక్ష జనవరి 28న రెండో షిఫ్ట్ మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఇప్పటికే జేఈఈ మెయిన్ పరీక్ష హాల్ టికెట్లను ఎన్టిఏ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనవరి 24న పరీక్ష రాసేవారు హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Advertisement
ఇక రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రెండు విడతల్లో వచ్చిన ఉత్తమ స్కోర్ ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్:jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.
READ ALSO : ‘శంకర్ దాదా MBBS’ టు ‘వాల్తేరు వీరయ్య’ చిరంజీవి గత 10 సినిమాల కలెక్షన్స్ ఇవే!