Jawan Movie Review : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పటాన్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లో ఉన్న షారుక్ ఖాన్ ఇప్పుడు జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ జవాను సినిమాలో షారుక్ ఖాన్ తండ్రి, కొడుకు రెండు పాత్రలలో అలరించాడు. ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, నయనతార, విజయ్ సేతుపతి మరియు ప్రియమణి అలాగే యోగిబాబు తదితరులు నటించారు.
Advertisement
కథ మరియు వివరణ
షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా కథ వివరాల్లోకి వెళితే… మన సమాజంలో జరిగే తప్పులను సరిదిద్దడానికి విక్రమ్ రాథోడ్ ఆరుగురు అమ్మాయిలతో కలిసి ముంబైలో ముంబై ట్రైన్ ను హైజాక్ చేస్తాడు. ఆ తర్వాత అతన్ని పట్టుకోవడానికి నర్మదా అంటే నయనతార పోలీస్ ఆఫీసర్ ప్రయత్నిస్తుంది. విక్రమ్ రాథోడ్ టార్గెట్ కాళీ అంటే విజయ్ సేతుపతి సామ్రాజ్యాన్ని నాశనం చేయడమే అన్నమాట. అలా టార్గెట్ చేస్తున్న సమయంలో విక్రమ్ రాథోడ్ కు ఎదురైన సవాళ్లు ఏంటి ? ఇంతకు ఆ విక్రం రాథోడ్ ముఖం వెనుక ఉన్నది ఎవరు ? అసలు రెండు పాత్రల్లో షారుఖ్ ఖాన్ ఎందుకు నటించాడు అనే విషయం తెలుసుకోవడానికి థియేటర్ కు వెళ్లి సినిమా చూడాల్సిందే..!
Advertisement
ఈ సినిమా దర్శకుడు అట్లీ ఏ ఒక్క అంశాన్ని కూడా వదలకుండా చాలా చక్కగా తీశాడు. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు అదిరిపోయే త్రిల్లింగ్ అంశాలను ఈ సినిమాలో చూపించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కు ఆడియన్స్ మొత్తం ఫిదా అయిపోతారు. పీక యాక్షన్ సీన్లతో కంటిరెప్ప వాల్చకుండా చూసేలా సినిమా చేశారు. కథ మరియు షారుక్ ఖాన్ యాక్టింగ్ ఈ సినిమాకే హైలెట్ గా నిలిచింది. అటు నయనతార మరియు దీపికా పడుకునే యాక్టింగ్ కూడా అదిరిపోయింది. బిగ్గెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో పాటు మరో మూడు బూస్ బంప్స్ మూమెంట్స్ ఉండటం సినిమాపై ఉన్న అంచనాలను రీచ్ అయ్యేలా చేసింది.
ప్లస్ పాయింట్స్
షారుక్ ఖాన్ యాక్టింగ్
కథ
ఇంటర్వెల్ ట్విస్ట్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
కాస్త సాగదీత
పీక్ యాక్షన్
రివ్యూ రేటింగ్ -3/5
ఇవి కూడా చదవండి
ఇండియా పాకిస్థాన్ మ్యాచ్..ఒక్క టికెట్ ధర రూ.57 లక్షలు?
Arjun Das : తన వాయిస్ వల్లే అవమానాలు ఎదుర్కొన్నాడు…ఇప్పుడు స్టార్ అయ్యాడు !
Kangana Ranawat : రోజా అంటే నాకు తెలియదంటున్న కంగానా… కౌంటర్ ఇచ్చిన రోజా ?