Health tips : కొన్ని వేల సంవత్సరాల నుంచి భారత వైద్య విధానంలో ఆయుర్వేదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రకృతి అందించిన వనమూలికల ద్వారా ఆయుర్వేద వైద్య విధానంలో ఉపయోగించి ఎన్నో అంతుచిక్కని ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కనుగొనబడింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అద్భుతమైన మూలిక జటామాన్సి. దీనిని ఆయుర్వేదంలో “తపస్వాని” అని కూడా ఇవ్వబడుతుంది. ఇది యుగాలుగా ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగించబడుతోంది.
జటామాన్సి అనేది మెదడు మరియు జ్ఞాపకశక్తిని పెంచే టానిక్‌గా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉండడం చేత మెదడులోని సెల్ డ్యామేజ్‌ను నివారించడంలో సహాయపడుతుంది. ఇది వివిధ ఆయుర్వేద మూలికా ఉత్పత్తులకు ముఖ్యమైన పదార్ధంగా పదిగనించబడుతుంది చేసే విశ్రాంతి మరియు ప్రశాంతత లక్షణాలను కూడా కలిగి ఉంది. ఇది మెదడును శాంతపరచడానికి మరియు ఆందోళనను నిద్రలేమిని తగ్గించడానికి సహాయపడుతుంది.
Advertisement
జాటమాన్సి ఉపయోగాలు :
జాటమాన్సి మంచి నిద్రను ప్రేరేపించడానికి ఉపయోగపడుతుంది. ఋతు ప్రవాహం సమయంలో తిమ్మిరి, నొప్పి మరియు అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మెనోపాజ్ అనేది చాలా మంది మహిళలకు శారీరకంగా మరియు మానసికంగా అసమతుల్యతలను నివారిస్తుంది. జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు జటామాన్సి ని ఉపయోగించడం వలన జుట్టు కుదురుళ్లు గట్టిపడి ఒత్తుగా తయారవుతాయి. పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచడంలో జటామన్సి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. పిల్లల్లో ఉండే వాత, పిత్త,కఫ దోషాలను నివారించడంలో చాలా బాగా పని చేస్తుంది.
Advertisement
జాటమాన్సి ఔషధం తయారు చేసుకునే విధానం :
జటామాన్సీని పొడి రూపంలో లేదా కషాయాల్లో తీసుకోవచ్చు. 1 నుంచి 3 గ్రాముల జటామాన్సీ పొడిని రోజు తేనె లేదా గోరువెచ్చని నీటితో ఒకటి లేదా రెండుసార్లు త్రాగడం వలన మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక కొబ్బరి నూనె, బాదం నూనె, అవకాడో నూనె మరియు జటామాన్సీ పొడిని సమాన భాగాలుగా తీసుకొని బాగా కలపండి. పొయ్యిపై చిన్న మంటపై పది నిమిషాలు వేడి చేయండి. చివరగా, వేడిచేసిన మిశ్రమాన్ని ఒక గంట పాటు చల్లార్చాలి. ఆ తర్వాత ఈ నూనెను వడకట్టి ఉపయోగం కోసం నిల్వ చేయవచ్చు. ఈ నూనెను ప్రతిరోజు వాడడం వల్ల జుట్టు ఒత్తుగా తయారవుతుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఈ 5 చిట్కాలతో మోకాళ్ళ నొప్పుల బాధ నుంచి సులభంగా బయటపడచ్చు..!
Rainy Season: వర్షాకాలంలో అధికంగా కామెర్ల వ్యాధి.. అరటిపండు అంత ప్రమాదమా?
Yawning : అదేపనిగా ఆవలింతలు రావడం అనారోగ్యానికి సంకేతమా..! నిపుణులు ఏమంటున్నారంటే..?