ఆసియా కప్ 2023 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా జట్టులో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అశోక 2023 టోర్నమెంటు ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు పాకిస్తాన్ మరియు శ్రీలంక వేదికలుగా జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కు కొత్త కెప్టెన్ రానున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు ప్రచురించాయి.
Advertisement
ప్రస్తుతం టీమిండియా కు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక రోహిత్ శర్మ రెస్టు తీసుకున్న సమయంలో హార్దిక్ పాండ్యా టీం లీడ్ చేస్తున్నాడు. అయితే మొన్న వెస్టిండీస్ టూర్ లో పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. దీంతో హార్దిక్ పాండ్యా పై వేటు వేసేందుకు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. ఆసియా కప్ 2023 టోర్నమెంట్ కు టీమిండియా వైస్ కెప్టెన్ గా జస్ప్రిత్ బుమ్రా ను ఎంపిక చేసేందుకు బీసీసీ సెలక్షన్ కమిటీ సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది.
Advertisement
ఆగస్టు 21వ తేదీన అంటే సోమవారం రోజున అజిత్ అగర్కర్ అధ్యక్షతన సెలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి రోహిత్ శర్మతో పాటు రాహుల్ ద్రావిడు కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుల స్పందనను తెలుసుకోనున్నారు. ఆ తర్వాత టీమిండియా వయసు కెప్టెన్ గా జస్ప్రిత్ బుమ్రాను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అంతేకాదు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ కు కూడా వయసు కెప్టెన్ గా జస్ప్రిత్ బుమ్రాను కంటిన్యూ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
Virat Kohli : క్రికెట్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ?
సీఎం కేసీఆర్ పార్టీకి అల్లు అర్జున్ ప్రచారం…!