డైమండ్ ను కోయాలంటే మరో డైమండ్ కావాల్సిందే. అయితే రాజకీయాల్లోనూ ఈ ఫార్ములాను ఎక్కువగానే వాడుతూ ఉంటారు. ఎక్కడైనా ఎన్నికల్లో నటీనటులను ఓడించాలంటే ఇతర పార్టీలు కూడా సినినటులనే బరిలోకి దింపుతాయి. అయితే ఇప్పుడు ఏపీలోని నగరి నియోజకవర్గంలో కూడా అదే జరగబోతున్నట్టు కనిపిస్తోంది. నగరి నియోజకవర్గం రోజా అడ్డాగా మారిన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా రోజా రెండు సార్లు పోటీ చేసి గెలిచారు.
Advertisement
అయితే ఇప్పుడు ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సీనియర్ హీరోయిన్ వానీ విశ్వనాథ్ రెడీ అవుతోంది. ఇప్పటికే తాను నగరి నుండి పోటీ చేస్తున్నట్టు వాణీ విశ్వనాథ్ ప్రకటించారు కూడా. అంతే కాకుండా ఆమె నగరిలో ఇటీవల పర్యటించగా భారీస్పందన వచ్చింది.
Advertisement
అయితే ఏ పార్టీ నుండి పోటీచేస్తారు అన్నదానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. టీడీపీ నుండి వాణీవిశ్వనాథ్ కు ఇక్కడ టికెట్ ఇచ్చే అవకాశాలు లేవు కాబట్టి అయితే బీజేపీ లేదా జనసేన నుండి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీలో బీజేపీ కంటే జనసేన ఓటు బలం ఎక్కువ కావడం వల్ల జనసేన నుండి పోటీచేస్తే ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ రోజు నగరిలో జనసేన కార్యకర్తలో జనసేన ప్లెక్సీలలో వాణీవిశ్వనాథ్ ఫోటోలు వేసి హంగామా సృష్టించారు. ఇదంతా చూస్తుంటే వాణీ విశ్వనాథ్ జనసేనలోకి చేరే అవకాశాలు ఉన్నట్టు కూడా నగరి వాతావరణం కనిపిస్తోంది. చివరికి వాణీ విశ్వనాథ్ ఎటువైపు వెళతారు..? ఏం జరుగుంది అనేది చూడాలి.