Home » Jan 27th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Jan 27th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

సీనియర్‌ నటి జమున కన్నుమూశారు. హైదరాబాద్‌లోని స్వగృహంలో జమున తుదిశ్వాసవిడిచారు.

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌లో సానియా-బోపన్న జోడి ఓడిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బ్రెజిల్‌ జంట స్టెఫాని-రఫెల్‌ చేతిలో 6-7, 2-6 తేడాతో సానియా-బోపన్న జోడి ఓటమి పాలయ్యింది.

Advertisement

తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్ లు నిండిపోయాయి. దాంతో వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 58,379 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,950 మంది భక్తులు దర్శించుకున్నారు.

నేడు భారత్‌తో కివీస్‌ తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది. రాంచీ వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

విశాఖ గాజువాకలో స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుల మహాపాదయాత్ర నిర్వహిస్తున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 30న ప్రజాగర్జన సభ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే విశాఖ ఉక్కు పోరాట కమిటీ అన్ని పార్టీల మద్దతు కోరుతుంది.

Advertisement

అనంతపురంలో కారు బీభత్సం సృష్టించింది. మహిళలపైకి కారు దూసుకెళ్లింది. ఇద్దరికి గాయాలు అవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం సేవించి కారు నడిపినట్లు సమాచారం.

హిందూపురంలో ప్రచార వాహనంపై నుంచి బాలకృష్ణ పడిపోయారు. కార్యకర్తలకు బాలకృష్ణ అభివాదం చేస్తుండగా కదిలిన వాహనం.. ఒక్కసారిగా వాహనం కదలడంతో బాలకృష్ణ వెనక్కి పడిపోయారు.

గవర్నర్‌కు కేసీఆర్ గౌరవం ఇవ్వడం లేదని బిజేపి నేత విజయశాంతి ఆరోపించారు. సొంత పార్టీలోని మహిళలకు కూడా గౌరవం ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ తొందరగా వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోవాలని అన్నారు.

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 30 న వైఎస్ ఆర్ చేదోడు పథకం డబ్బులను ఖాతాలలో జమ చేస్తామని ప్రకటించింది.

ఆర్థిక సంక్షభం ఎఫెక్ట్ తో పాక్ రూపాయి రికార్డు స్థాయిలో పతనం అయ్యింది. రూపాయి విలువ డాలర్ కు రూ. 255 కు పడిపోయినట్లు తెలుస్తోంది.

Visitors Are Also Reading