Home » ఆ బంధాలు ఇప్ప‌టి సినిమావాళ్ల‌ల్లో ఎక్క‌డా? జ‌మున భావోద్వేగం!

ఆ బంధాలు ఇప్ప‌టి సినిమావాళ్ల‌ల్లో ఎక్క‌డా? జ‌మున భావోద్వేగం!

by Azhar
Ad

బొమ్మ‌ల కొలువు అంటే ఇప్ప‌టి త‌రానికి చాలా మందికి తెలియ‌దు. బొమ్మ అంటే బ్రహ్మ అని అర్థం. బ్రహ్మ నుండి చీమ వరకు అన్నింటిలో భగవంతుడిని దర్శించవచ్చన్న భావనతో బొమ్మలకొలువును ఏర్పాటుచేసి, హారతి పట్టడం లాంటివి పూర్వీకులు మనకు నేర్పించిన‌ సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని కొనసాగించేవారు ప్ర‌స్తుత త‌రంవారికి పెద్ద‌గా తెలియ‌దు అనే చెప్పాలి. కానీ ఒకప్పుడు బొమ్మలకొలువును ఏర్పాటు చేయడం లేదా వాటికి హాజరవడం అంటే ఎంతో సరదాగా ఉండేది. సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అలనాటి నటి జమునగారికీ ఈ సరదా ఉంది. చిన్నతనంలో దుగ్గిరాలలో బొమ్మల పెళ్లిళ్లలో సేకరించిన తాటాకు బొమ్మలు మొదలుకొని, ఈ మధ్య అమెరికాలో కొన్న బొమ్మల వరకు ఆమె బొమ్మల కొలువులో కొలువు తీరాల్సిందే. జమునగారి ఉత్సాహానికి అప్ప‌ట్లో ఆమె తల్లిగారి ప్రోత్సాహం కూడా జత అయ్యేది.

Advertisement

Advertisement

ఇక ఈ బొమ్మ‌ల కొలువుకు చాలా మంది ఆహ్వాన పత్రాలను కూడా ముద్రించి అందరికీ పంపేవారు. క్రమం తప్పకుండా ఎందరో ప్రముఖులు వచ్చేవారు. ఎందుకంటే జమునంటే వారంద‌రికి అంత ఇష్టం మ‌రి. జమున ఇంట పేరంటమన్నా నవరాత్రులప్పుడు రోజూ ఉదయం అమ్మవారి పూజలు, సాయంత్రం బొమ్మలకొలువు పేరంటం… ఇలా తన ఆరో యేట మొదలు గత ఏడు దశాబ్దాలుగా అలుపెరగకుండా జమున బొమ్మల కొలువు పెడుతూనే ఉన్నారు. ఇలా ఎన్నో రకాల బొమ్మలతో శోభాయమానంగా, విజ్ఞానదాయకంగా కొలువును ఏర్పాటు చేసేవారు శ్రీమతి జమున. ఇక ఈమె పెట్టే బొమ్మ‌ల కొలువుకు అప్ప‌ట్లో ఉన్న హీరోయిన్లంద‌రూ కూడా త‌ప్ప‌కుండా హాజ‌ర‌య్యేవారు, సావిత్రి, వాణిశ్రీ, కృష్ణ‌కుమారి ఇలా ఎంతో మంది వ‌చ్చేవారు. ఆమెతో క‌లిసి పూజ‌లో పాల్గొని పేరంటానికి హాజ‌య్యేవారు. అప్ప‌ట్లో హీరోయిన్లు అంద‌రూ అలా క‌లిసిమెలిసి ఉండేవారు. అలాగే సినిమా షూటింగ్ సెట్ల‌లో కూడా ఎంతో పండ‌గ వాతావ‌ర‌ణంలాగా అంద‌రూ క‌లిసి మెల‌సి ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. అలాగే సినిమా అయిపోయాక విడిపోయే ముందు కూడా ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో భావోద్వేగాల‌కు లోన‌య్యేవారు.

మ‌రి ఇప్ప‌టి హీరోయిన్లలో అస‌లు ఆ క‌లుపుగోలుత‌నం ఎక్క‌డుంది. అస‌లు ముందు మ‌న తెలుగు భాష వ‌స్తే క‌దా. తెలుగు హీరోయిన్లు ఉంటే క‌దా ఒక‌రొకొక‌రు మాట్లాడుకుని వారి మంచి చెడుల‌ను పంచుకోవ‌డానికి. ఒక‌రికి తెలుగు వ‌స్తే..మ‌రొక‌రికి హిందీ..వేరొక‌రికి ఏకంగా ఇంగ్లీష్ త‌ప్ప వేరే భాషే రాదు. భాషే రాన‌ప్పుడే భావాల‌ను ఎలా పంచుకుంటారు. ఇక హీరో.. హీరోయిన్ల ప‌రిస్థితి కూడా అంతే ఎవ‌రికివారే ఎమునా తీరే అన్న‌ట్లు ఉంటారు. షూటింగ్ స్పాట్‌లో కూడా ఎవ‌రి సీన్ వ‌చ్చిన‌ప్పుడు వారు రావ‌డం న‌టించ‌డం వెళ్ళిపోవ‌డం అంత వ‌ర‌కే. ఇక కొన్ని సంద‌ర్భాల్లో అయితే ఎవ్వ‌రూ లేక‌పోయినా ఎవ‌రి సీన్స్ వారికి విడి విడిగా షూట్ చేసి గ్రీన్ మ్యాట్‌ల‌తో హీరో హీరోయిన్ల‌ను క‌లిపిన‌ ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఆనాటి బంధాలు.. ఈ నాడు ఎక్క‌డున్నాయి మ‌రి.

Visitors Are Also Reading